హాకీలో నిరాశే..
మహిళల హాకీ జట్టు మరోసారి నిరాశపరిచింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో నెధర్లాండ్స్తో జరిగిన పోరులోనూ ఓటమిపాలైంది మహిళల జట్టు.
19:18 July 26

16:27 July 26
స్విమ్మింగ్‌లో..
200మీ. పురుషుల బటర్ ఫ్లై స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ ఆకట్టుకున్నప్పటికీ.. సెమీస్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఒక నిమిషం 57.22 సెకన్లలో లక్ష్యాన్ని అందుకున్నాడు ప్రకాశ్. మొత్తంగా 24వ స్థానంలో నిలిచాడు సాజన్.
15:27 July 26
బాక్సింగ్‌లో తప్పిన పంచ్..
బాక్సింగ్‌లో పురుషుల 75కేజీల విభాగంలో జరిగిన 32వ రౌండ్ ప్రిలిమ్స్‌లో భారత అథ్లెట్ ఆశిశ్ కుమార్ ఓటమిపాలయ్యాడు.
13:36 July 26
నిరాశపర్చిన మనిక
టేబుల్ టెన్నిస్ మహిళా ప్లేయర్ మనికా బత్రా మూడో రౌండ్లో ఓడిపోయింది. ఆస్ట్రియాకు చెందిన పోల్కనోవా సోఫియా చేతిలో 4-0 తేడాతో ఓటమిపాలై, నిష్క్రమించింది.
12:08 July 26
స్కీట్ షూటింగ్‌లోనే నిరాశే
భారత షూటర్ అంగద్ వీర్ సింగ్.. టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. స్కీట్ షూటింగ్ క్వాలిపికేషన్ రౌండ్లో 18వ స్థానంలో నిలవడం వల్ల ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మరో షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్ 25వ స్థానంలో నిలిచాడు.
11:54 July 26
సుమిత్ కూడా నిష్క్రమణ
టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్.. ఆర్ఓసీ ప్లేయర్ మెద్వదేన్ డేనిల్ చేతిలో వరుస సెట్లలో 2-6, 1-6 తేడాతో ఓడిపోయాడు.
10:36 July 26
సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లోనూ ఇండోనేసియా చేతిలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడి ఓడింది. వరుస సెట్లు కోల్పోవడం వల్ల 0-2 తేడాతో ఓటమిపాలైంది.
10:35 July 26
ఒలింపిక్స్ నుంచి ఆర్చరీ జట్టు నిష్క్రమణ
క్వార్టర్స్‌లో భారత్ జట్టు నిరాశపరిచింది. దక్షిణ కొరియాతో పోరులో 0-6 తేడాతో ఓటమిపాలైంది. టాప్ సీడ్ కొరియా ప్రదర్శన ముందు నిలవలేకపోయింది.
09:39 July 26
సుతీర్ధ ఔట్
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సుతీర్ధ ముఖర్జీ.. రెండో రౌండ్లో ఓడిపోయింది. పోర్చుగల్ క్రీడాకారిణి యూ ఫూ చేతిలో 4-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థి ప్లేయర్ దూకుడు ప్రదర్శించగా, సుతీర్ధ కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది.
08:01 July 26
ఫెన్సర్ భవానీదేవి ఓటమి
ఒలింపిక్స్‌లో మన దేశం నుంచి పాల్గొన్న ఏకైక ఫెన్సర్ భవానీ దేవి ఓడిపోయింది. తొలి పోరులో నదియాపై గెలిచిన ఆమె.. టేబుల్ ఆఫ్-32 మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన మనోన్ బ్రునెట్‌తో తలపడింది. కానీ 7-15 తేడాతో ఓటమిపాలైంది. 27 ఏళ్ల ప్లేయర్‌కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం.
07:20 July 26
టీటీ సింగిల్స్‌లో కమల్ గెలుపు
టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్లో ఆచంట కమల్ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో గెలిచాడు.
06:48 July 26
ఫెన్సర్ భవానీ దేవి
భారత ఫెన్సర్ భవానీ దేవి చరిత్ర సృష్టించింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని, తొలి రౌండ్లో విజయం సాధించింది. ట్యూనీషియాకు చెందిన నదియా బెన్ అజీజీపై 15-3 తేడాతో గెలిచింది. 6 నిమిషాల్లో ఈ పోటీ పూర్తయింది.
06:25 July 26
ఆర్చరీ జట్టు తర్వాత రౌండ్‌కు
భారత పురుషుల ఆర్చరీ జట్టు(అతాను దాస్, తరణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన పోటీలో కజకిస్థాన్ బృందంపై 6-2 తేడాతో విజయం సాధించింది. అనంతరం దక్షిణ కొరియాతో తలపడనున్నారు.