ETV Bharat / sports

Olympics India: వెండితో మెరిసిన మీరా.. హాకీ, టీటీలో అదుర్స్

టోక్యో ఒలింపిక్స్​లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన వెయిట్​లిఫ్టర్​ మీరాబాయి చాను.. వెండి పతకం అందుకుంది. మరోవైపు టీటీ ప్లేయర్ మనికా బత్రా, డబుల్స్​ షట్లర్లు సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ, హాకీ పురుషుల జట్టు, టెన్నిస్ ప్లేయర్ సుమిత్​ నగాల్.. తమ తమ మ్యాచ్​ల్లో విజయం సాధించారు.

OLYMPICS INDIA RESULTS NEWS
స్పోర్ట్స్ న్యూస్
author img

By

Published : Jul 24, 2021, 2:27 PM IST

Updated : Jul 24, 2021, 6:50 PM IST

ఒలింపిక్స్​లో శనివారం భారత్ మిశ్రమ ఫలితాలను అందుకుంది. అత్యుత్తమంగా వెయిట్​ లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్​ మెడల్ అందుకుంది. టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం ఇదే. హాకీ పురుషుల జట్టు, బ్యాడ్మింటన్​ మెన్స్​ డబుల్స్​ టీంలు ముందడుగు వేశాయి.

జులై 24 ఫలితాలు..

షూటింగ్​లో నిరాశ..

శనివారం జరిగిన షూటింగ్​ పోటీల్లో.. భారత క్రీడాకారులు పూర్తిగా నిరాశపరిచారు.

  • తొలుత షూటింగ్ 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్ క్వాలిఫికేషన్​ రౌండ్​లో భారత మహిళ షూటర్లు నిరాశపరిచారు. ప్రపంచ నం.1 అయిన ఎలవెనిల్ వలరివన్, అపూర్వి చండేలా.. కనీసం టాప్-8లో నిలవలేకపోయారు.
  • 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో భారత్​ షూటర్లు సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ నిరాశపరిచారు. క్వాలిఫికేషన్స్​లో టాప్​-8లో సౌరభ్ చౌదరి నిలిచినప్పటికీ, పతకం మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఫైనల్లో 7వ స్థానానికి పరిమితమయ్యాడు. మరో షూటర్ అభిషేక్ వర్మ.. క్వాలిఫికేషన్​ రౌండ్​లో 17వ స్థానంలో నిలిచి, పోటీ నుంచి ముందే నిష్క్రమించాడు.

ఆర్చరీలో ఊరించి..

  • ఆర్చరీ మిక్స్​డ్ టీమ్​ ఈవెంట్​లో భారత్​ ద్వయం దీపికా కుమారి-ప్రవీణ్ జాదవ్.. చైనీస్ తైపీపై గెలిచి, క్వార్టర్స్​కు అర్హత సాధించారు. అందులో దక్షిణకొరియా చేతిలో 6-2 తేడాతో ఓడి, ఇంటిముఖం పట్టారు.

హాకీలో అదుర్స్​..

indian men hockey team olympics
భారత పురుషుల హాకీ జట్టు
  • హాకీ తొలి మ్యాచ్​లో భారత్ శుభారంభం చేసింది. న్యూజిలాండ్​పై 3-2 తేడాతో విజయం సాధించింది. హర్మన్​ప్రీత్ సింగ్ 2, రూపిందర్ సింగ్ గోల్​ చేసి, తమ వంతు పాత్ర పోషించారు. ఆదివారం (జులై 25) తర్వాతి మ్యాచ్​లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

మిగతా ఈవెంట్లు..

  • జుడో 48 కిలోల ఎలిమినేషన్​ రౌండ్​లో పోటీపడిన మన క్రీడాకారిణి సుశీలా దేవి.. ఎవా సెర్నోవిక్జీ(హంగేరీ) చేతిలో ఓడింది. ఈ విభాగంలో పాల్గొన్న ఒకే ఒక్క ప్లేయర్ సుశీల కావడం వల్ల, ఇందులో భారత్ ప్రయాణ ముగిసినట్లయింది.
    sushila devi judo match
    సుశీలా దేవి జుడో మ్యాచ్

టేబుల్​ టెన్నిస్​లో మిశ్రమ ఫలితాలు..

  • టేబుల్ టెన్నిస్ మిక్స్​డ్ డబుల్స్​ విభాగంలో భారత జోడీ మనికా బత్రా- శరత్​కమల్.. ముందడుగు వేయలేకపోయారు. గ్రూప్​ దశలోని తొలి మ్యాచ్​లో చైనీస్ తైపీ చేతిలో ఓడి, ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించారు.
    manika batra olympics
    మనికా బత్రా
  • టేబుల్​ టెన్నిస్​ మహిళల సింగిల్స్​ తొలి రౌండ్​లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్​ బ్రిటన్​ క్రీడాకారిణిపై నాలుగు వరుస గేమ్​ల్లో గెలిచింది. 11-7, 11-6, 12-10, 11-9 తేడాతో చిత్తు చేసింది.
  • మహిళల సింగిల్స్​ మరో మ్యాచ్​లో సుతిర్థ ముఖర్జీ.. స్వీడెన్​ క్రీడాకారిణిపై గెలిచి తదుపరి రౌండ్​కు అర్హత సాధించింది.

బ్యాడ్మింటన్​లోనూ మిశ్రమ ఫలితాలే..

  • బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్​లో యువ షట్లర్ సాయిప్రణీత్ నిరాశపరిచాడు. ఇజ్రాయెల్​కు చెందిన జిల్బర్​మన్ చేతిలో 17-21, 15-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. తర్వాతి గేమ్​లో 29వ ర్యాంక్​ షట్లర్​ మార్క్​తో తలపడనున్నాడు.
  • బ్యాడ్మింటన్​ డబుల్స్​లో పురుషుల జోడీ సాయిరాజ్- చిరాగ్​శెట్టి మరో రౌండ్​కు అర్హత సాధించారు. ప్రపంచ నం.3 అయిన చైనీస్ తైపీ ద్వయం లీయాంగ్- వాంగ్ చీ లిన్​పై 21-16, 16-21, 27-25 సెట్ల తేడాతో విజయం సాధించింది.

టెన్నిస్​లో సంచలనం..

  • భారత టెన్నిస్​ యువ కెరటం సుమిత్​ నగాల్​ అదరగొట్టాడు. తొలి రౌండ్​లో ఉజ్బెకిస్థాన్​కు చెందిన డెనిస్​ ఇస్తోమిన్​పై 6-4, 6-7, 6-4 తేడాతో గెలిచి రెండో రౌండ్​కు అర్హత సాధించాడు. తద్వారా.. ఒలింపిక్స్​ మెన్స్​ సింగిల్స్​ ఈవెంట్​లో గత 25 ఏళ్లలో గెలిచిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

పతాక రెపరెపలు..

  • భారత మహిళా వెయిట్​లిఫ్టర్ మీరాబాయ్ చాను చరిత్ర సృష్టించింది. 49 కిలోల విభాగంలో రజతం సాధించి, ఈ ఒలింపిక్స్​లో దేశానికి తొలి పతకం అందించింది. ఆమెకు ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బాక్సింగ్​..

బాక్సింగ్​లో డీలా..

  • టోక్యో ఒలింపిక్స్​ బాక్సింగ్​ పోటీల్లో వికాశ్​ కృష్ణన్​ డీలాపడ్డాడు. పురుషుల 69 కేజీల విభాగంలో గ్రూప్​ దశలోనే ఓడిపోయాడు. వికాశ్​పై జపాన్​కు చెందిన ఒకజావా గెలుపొందాడు

మహిళల హాకీలో నిరాశ...

  • ఒలింపిక్స్​లో భాగంగా మహిళల హాకీలో భారత్​ శుభారంభం చేయలేకపోయింది. నెథర్లాండ్స్​తో జరిగిన పోరులో విఫలమైంది. 1-5తో ఆ జట్టుపై భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. మ్యాచ్​ ప్రారంభంలో నెథర్లాండ్స్​కు గట్టిపోటీనిచ్చిన మహిళ జట్టు.. చివరి 30 నిమిషాల్లో చేతులెత్తేసింది. 1-2తో వెనకంజలో ఉన్నప్పటికీ, స్కోర్లను సమం చేస్తుందనే నమ్మకం అభిమానులకు కలిగింది. కానీ చివరికి 1-5తో ఓడిపోయింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 24, 2021, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.