ఒలింపిక్స్ కాంస్య పోరులో గ్రేట్ బ్రిటన్పై ఓడిన భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా సంభాషించారు. ఓడిపోయినా.. మహిళలు తమ ప్రదర్శనతో దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.
మోదీ సంభాషణ సాగిందిలా..
రాణి రాంపాల్:- నమస్కారం సర్.
మోదీ:- నమస్తే నమస్తే.. మేమందరం మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. 5-6ఏళ్లుగా మీరు చేసిన కఠిన సాధనను మేము చూస్తూనే ఉన్నాం. మీ కష్టం ఎక్కడికీ పోలేదు. కష్టంతో మీకు పట్టిన చెమటలు.. దేశంలోని ఆడబిడ్డలకు స్ఫూర్తిగా నిలిచాయి. నేను మీ జట్టు బృందం, కోచ్, అందరికి శుభాకాంక్షలు చెబుతున్నా.
రాణి రాంపాల్:- థ్యాంక్యూ సర్. మీరు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.
మోదీ:- నిరాశ పడకూడదు. నేను చూశా.. నవనీత్ కళ్లకు దెబ్బ తగిలిందా?
రాణి రాంపాల్:- అవును సర్. నిన్న దెబ్బ తగిలింది. 4 కుట్లు పడ్డాయి.
మోదీ:- చూస్కుని ఉండాల్సింది. కళ్లుకు ఇబ్బంది ఏమైనా ఉందా?
రాణి రాంపాల్:- లేదు సర్. బాగుంది.
మోదీ:- వందన.. మీరందరూ చాలా బాగా ఆడారు. సలీమా గొప్పగా ఆడుతుందని అందరికీ అనిపించింది.
రాణి రాంపాల్:- థ్యాంక్యూ సర్.
మోదీ:- మీరు కన్నీళ్లు పెట్టుకోకండి. నాకు వినిపిస్తోంది. మీరు కన్నీళ్లు పెట్టుకోకండి. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. అస్సలు నిరాశపడకూడదు. మీ వల్ల చాలా ఏళ్ల తర్వాత.. హాకీలో దేశం పేరు పునర్జీవం పోసుకుంటోంది. ఇది మీ కష్టం వల్లే.
కోచ్ కూడా చాలా బాగా పనిచేశారు. మీ శ్రమ కనపడుతోంది. ఇలాగే కొనసాగించండి.
కోచ్:- థ్యాంక్యూ సర్. మీ సహకారానికి ధన్యవాదాలు. అమ్మాయిలు దేశ ప్రజల్లో స్ఫూర్తినింపారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
-
#WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021#WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021
ఇదీ చూడండి:- 'నవ భారతావనికి ఈ హాకీ వనితలు స్ఫూర్తి'