ETV Bharat / sports

'మహిళలూ.. దేశం మీ వెంటే ఉంది'

author img

By

Published : Aug 2, 2021, 1:47 PM IST

Updated : Aug 2, 2021, 3:10 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్స్​లో మహిళల హాకీ జట్టు విజయం సాధించి సెమీస్​లోకి దూసుకెళ్లింది. దీంతో జట్టుపై పలువురు క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసలు కురిపించారు. ఈ జట్టు పతకం సాధిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

hockey
హాకీ

టోక్యో ఒలింపిక్స్​లో సోమవారం జరిగిన హాకీ క్వార్టర్స్​లో భారత మహిళల జట్టు.. ప్రపంచ నంబరు.2 జట్టైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో గెలుపొంది.. సెమీఫైనల్​కు చేరింది. విశ్వక్రీడల్లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనల్​కు చేరడం ఇదే తొలిసారి. 1980 మాస్కోలో జరిగిన విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మెగాక్రీడల్లో మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయడం విశేషం. దీంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు హాకీ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

"ఈ ఆటలో భారత జట్టు ఎక్కడా తగ్గలేదు. జోరు ప్రదర్శిస్తూనే ఉంది. ఆస్ట్రేలియా జట్టుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘనతంతా డిఫెన్స్​, గోల్​ కీపర్​కు చెందుతుంది. పతకం గెలవడానికి చాలా దగ్గరగా ఉన్నాం. గతంలో హాకీలో జట్టు స్వర్ణం సాధించింది. ఈ సారి కూడా సాధిస్తుందని ఆశిద్దాం. ఆల్​ ది బెస్ట్​."

-అశోక్​ ధ్యాన్​ చంద్​, మాజీ హాకీ కెప్టెన్​.

ashok
అశోక్​ ధ్యాన్​ చంద్

"అద్భుత ప్రదర్శన.. టోక్యో ఒలింపిక్స్​ 2020లో టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. జట్టుకు నా అభినందనలు. ఆస్ట్రేలియాపై నెగ్గి విశ్వక్రీడల్లో తొలిసారి సెమీఫైనల్స్​కు చేరుకున్నాం. మహిళలు.. మీ వెన్నంటే మేము ఉన్నాము."

-అనురాగ్​ ఠాకుర్​, కేంద్ర క్రీడా శాఖ మంత్రి.

  • Splendid Performance!!!

    Women’s Hockey #TeamIndia is scripting history with every move at #Tokyo2020 !

    We’re into the semi-finals of the Olympics for the 1st time beating Australia.

    130 crore Indians 🇮🇳 to the
    Women’s Hockey Team -
    “we’re right behind you”! pic.twitter.com/vusiXVCGde

    — Anurag Thakur (@ianuragthakur) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత కల నెరవేరబోతోంది! మన మహిళ హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ ఒలింపిక్స్​లో పురుషులు, మహిళల హాకీ జట్లు.. రెండూ సెమీస్​కు చేరుకున్నాయి. నా సంతోషం, ఉత్సాహాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావట్లేదు."

-కిరణ్​ రిజిజు, మాజీ క్రీడాశాఖ మంత్రి, ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి.

  • Not only has PV Sindhu won a well deserved medal, but also we saw historic efforts by the men’s and women’s hockey teams at the Olympics. I’m optimistic that 130 crore Indians will continue to work hard to ensure India reaches new heights as it celebrates its Amrut Mahotsav.

    — Narendra Modi (@narendramodi) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Glory awaits!

    Congratulate Indian Women’s #Hockey Team on registering a thumping victory in the quarter-final against Australia at #Tokyo2020. May the team continue its winning streak & bring glory to the country. Wish the team all the best.#Cheer4India @thehockeyindia

    — Naveen Patnaik (@Naveen_Odisha) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Incredible Morning. So proud of our women’s hockey team. Nothing unites us the way sport does !!! #twomoretogo

    — Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • If you thought Sunday was good then our women have just gone and made Monday exceptional with a performance for the ages!
    First semifinal appearance in an Olympic Games and that's how you do it - with a big, solid fight. Had us glued throughout. #TeamIndia #Tokyo2020

    — Sunil Chhetri (@chetrisunil11) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మ్యాచ్​లో 22వ నిమిషం వద్ద భారత క్రీడాకారిణి గుర్జిత్​ కౌర్ గోల్​ చేసింది. ఆ తర్వాత మ్యాచ్​లో ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన రాణి రాంపాల్​సేన.. ప్రత్యర్థిని ఖాతా తెరవనీయకుండా అడ్డుకోగలిగింది. ఇక గోల్​ కీపర్​ సవితా పునియా.. ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నాలను 9 సార్లు నిలువరించింది. ఈ విజయంలో ఎక్కువ శాతం ఘనత ఆమెకే చెందుతుంది. బుధవారం(ఆగస్టు 4) జరగనున్న సెమీఫైనల్​లో అర్జెంటీనాతో భారత మహిళా హకీ జట్టు తలపడనుంది.

అంతకుముందు భారత పురుషుల హాకీ జట్టు.. సెమీస్​లోకి దూసుకెళ్లింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించింది. గ్రేట్​ బ్రిటన్​తో ఆదివారం జరిగిన క్వార్టర్స్​ ఫైనల్​ మ్యాచ్​లో 3-1 తేడాతో గెలిచింది. మంగళవారం(ఆగస్టు 3) సెమీస్​లో బెల్జియంతో తలపడనుంది.

ఇదీ చూడండి: దుమ్మురేపిన మహిళల హాకీ జట్టు.. క్వార్టర్స్​లో విజయం

Last Updated : Aug 2, 2021, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.