ETV Bharat / sports

Bhavinaben Patel: 'నేను దివ్యాంగురాలినని ఎప్పుడూ అనుకోలేదు'

తనను తాను దివ్యాంగురాలినని ఎప్పుడు అనుకోలేదని వెల్లడించింది భారత టేబుల్​ టెన్నిస్ ప్లేయర్​ భవీనాబెన్​ పటేల్ (Bhavinaben Patel). తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపింది. టోక్యో పారాలింపిక్స్​ టీటీ సెమీస్​లో విజయానంతరం ఆమె ఇంకా ఏయే విషయాలు చెప్పిందంటే?

bhavnaben patel paralympics
భవీనాబెన్ పటేల్
author img

By

Published : Aug 28, 2021, 2:30 PM IST

"తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదని" నిరూపించింది భారత టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనాబెన్​ పటేల్ (Bhavinaben Patel). తనను తానెప్పుడు దివ్యాంగురాలినని అనుకోలేదని తెలిపింది. పారాలింపిక్స్​ టీటీ సెమీస్​లో విజయానంతరం మీడియాతో మాట్లాడింది భవీనా.

"నన్ను నేను దివ్యాంగురాలినని ఎప్పుడు అనుకోలేదు. నేనేదైనా చేయగలననే ఆత్మవిశ్వాసం నాలో అన్నివేళలా ఉండేది. మేము (దివ్యాంగులు) వెనకబడి లేమని నేనిప్పటికే నిరూపించాను. పారా టేబుల్​ టెన్నిస్​ ఆట కూడా ఇతర క్రీడల వలే ముందుంది. చైనాతో పోటీపడాలంటే చాలా కష్టమని చాలా మంది చెబుతారు. నేను ఈ రోజు చైనా ప్యాడ్లర్​పై విజయాన్ని సాధించాను. తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నేను నిరూపించాను. మీరు కూడా అనుకుంటే ఏదైనా చేయొచ్చు.

-భవీనాబెన్ పటేల్, భారత టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి.

"రోజూ ఉదయం 4.00 గంటలకే నా ప్రణాళిక మొదలవుతుంది. మెడిటేషన్, యోగా చేస్తాను. ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. తొందరపాటులో మ్యాచ్​ సందర్భంగా మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఈ రోజు అలా జరగకుండా నన్ను నేను చాలా నియంత్రించుకున్నాను. నా విజయానికి దోహదపడిన కోచ్​లు, సహాయ సిబ్బందికి ధన్యవాదములు" అని భవీనా పేర్కొంది.

"ఆటగాళ్లకు ఆర్థికంగా మద్దతు లభించనంత కాలం వారు చాలా వెనకబడతారు. మిడిల్​ క్లాస్​ కుటుంబాలకు ఇది చాలా పెద్ద విషయం. కానీ, సాయ్​, టాప్స్​, పీసీఐ, ప్రభుత్వం, ఓజీక్యూ, బ్లైండ్​ పీపుల్స్​ అసోసియేషన్, నా కుటుంబం.. ఈ విషయంలో చాలా మద్దతుగా నిలిచారు" అని టీటీ ప్లేయర్​ తెలిపింది.

సెమీస్​లో చైనా ప్లేయర్ మియావో జాంగ్​తో పోటీ పడిన భవీనా.. ఆమెను 3-2తో చిత్తుచేసింది. గతంలో వీరిద్దరూ 11 సార్లు ముఖాముఖి తలపడ్డారు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్​ పోరులో చైనా ప్లేయర్​ యింగ్ ఝోతో పోరుకు సిద్ధం చేసింది.

ఇదీ చదవండి: Bhavina Patel:​ టీటీ ఫైనల్లో భవీనాబెన్​.. స్వర్ణంపైనే గురి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.