ETV Bharat / sports

చరిత్ర తిరగరాయడానికి అడుగు దూరంలో భారత గోల్ఫర్​!

భారత్​కు మరో పతకం ఖాయం అయ్యే అవకాశముంది. ఒలింపిక్స్​లో దూసుకుపోతున్న భారత గోల్ఫర్​ అదితి అశోక్​ రజతం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

aditi
అదితి
author img

By

Published : Aug 6, 2021, 12:28 PM IST

భారత గోల్ఫ్ క్రీడాకారిణి​ అదితి అశోక్​.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్​ 3 లో రెండో స్థానంలో నిలిచిన అదితి.. ఈ ఈవెంట్​లో రజతం సాధించే అవకాశముంది. ప్రస్తుతం మూడు రౌండ్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది అదితి. అమెరికాకు చెందిన నెల్లి కొర్డా మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా హన్నా గ్రీన్​, న్యూజిలాండ్​కు చెందిన లైడియా మూడో స్థానంలో ఉన్నారు.

aditi ashok
అదితి అశోక్​

అయితే శుక్రవారం జరగాల్సిన రౌండ్​ 4.. వాతావరణ సమస్యల కారణంగా శనివారానికి మార్చారు. ఒకవేళ శనివారం కూడా పోటీలు​ జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితి అశోక్​కు​ రజతం లభిస్తుంది. ఇదే జరిగితే ఒలింపిక్స్​లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్​గా అదితి చరిత్ర సృష్టిస్తుంది.

ఇదీ చూడండి:- ఒలింపిక్స్​లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.