కరోనా వైరస్ దెబ్బకు క్రీడా రంగం కుదేలైపోయింది. ఇప్పటికే పలు టోర్నీలు నెలల పాటు వాయిదా పడగా... తాజాగా టెన్నిస్ పైనా కొవిడ్-19 ప్రభావం పడింది. పురుషులు, మహిళలకు సంబంధించిన అన్ని టెన్నిస్ టోర్నమెంట్లు జూన్ 7వ తేదీ వరకు నిలిపివేశారు. గతంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం క్రీడలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రకటించాయి ఏటీపీ, డబ్ల్యూటీఏ. త్వరలో ప్రారంభమవ్వాల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌నూ మే నుంచి సెప్టెంబరుకు వాయిదా వేశారు. ఏప్రిల్ చివరి వరకు అన్ని పర్యటనలు రద్దు చేశారు. ఇది మే వరకు పెంచే అవకాశం ఉంది.
ఆ దేశాల్లోనూ..
త్వరలో స్ట్రాస్‌బర్గ్, ఫ్రాన్స్, రబాట్, మొరాకోలలో జరగనున్న డబ్ల్యూటీఏ టోర్నీలతో పాటు.. మ్యూనిచ్, ఎస్టోరిల్, పోర్చుగల్, జెనీవా, లియోన్, ఫ్రాన్స్‌లో జరగనున్న ఏటీపీ కార్యక్రమాలు రద్దయ్యాయి. తదుపరి ప్రకటన వచ్చే వరకు అన్ని క్రీడలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భారత జట్టు విలువైన ఆస్తి ధోనీ: జాఫర్