ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వార్టర్స్​లో జకోవిచ్​, సెరెనా - ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో క్వార్టర్స్​లోకి దూసుకెళ్లిన సెరెనా విలియమ్స్

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో టాప్​సీడ్​ ఆటగాళ్లు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్​ మ్యాచ్​లో పూర్తి ఫిట్​గా లేకుండానే బరిలోకి దిగిన సెర్బియా వీరుడు నొవాక్​ జకోవిచ్​.. రౌనిక్​పై అద్భుత విజయం సాధించి క్వార్టర్స్​కు చేరుకున్నాడు. మరో టాప్​ ఆటగాడు డొమినిక్​ థీమ్​ మూడో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్​లో ముందడుగేసిన సిమోనా హలెప్, సెరెనా విలియమ్స్​.. క్వార్టర్స్​ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమయ్యారు.

Djokovic beats Raonic, reaches QFs in Australia
'300వ విజయం'తో ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వార్టర్స్​లో జకోవిచ్​
author img

By

Published : Feb 14, 2021, 9:18 PM IST

Updated : Feb 14, 2021, 9:45 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​లో సెర్బియా వీరుడు నొవాక్​ జకోవిచ్​ క్వార్టర్​ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఎనిమిది సార్లు ఈ గ్రాండ్​స్లామ్​ను సొంతం చేసుకున్న ఈ ఆటగాడు​.. రౌనిక్(2016- వింబుల్డన్​ ఫైనలిస్ట్​)​ను ఓడించాడు. నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ గేమ్​లో 7-6(4), 4-6, 6-1, 6-4 తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి.. 300వ గ్రాండ్​స్లామ్​ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. రోజర్​ ఫెదరర్​ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా ఈ సెర్బియా వీరుడు ఘనత సాధించాడు. గాయంతో శనివారం ప్రాక్టీస్​కు దూరమైన నొవాక్​.. పూర్తిగా కోలుకోకుండానే బరిలోకి దిగి అద్భుత విజయం సాధించడం విశేషం. క్వార్టర్స్​లో జకో.. అలెగ్జాండర్​ జ్వెరెవ్​తో తలపడనున్నాడు. యూఎస్​ ఓపెన్​ ఫైనలిస్ట్​ అలెగ్జాండర్​.. 23వ సీడ్​ దుసాన్​ లాజోవిక్​ను 6-4, 7-6(5), 6-3 తేడాతో ఓడించి క్వార్టర్స్​లోకి ప్రవేశించాడు.

మరో మ్యాచ్​లో 18వ సీడ్​ గ్రిగర్​ డిమిట్రోవ్​ 6-4, 6-4, 6-0తో మూడో సీడ్​ డొమినిక్​ థీమ్​ను ఓడించి నాలుగోసారి ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వార్టర్స్​లోకి చేరాడు. కెరీర్​ అత్యుత్తమ(3వ) ర్యాంకులో ఉన్న డిమిట్రోవ్​.. తన తదుపరి మ్యాచ్​లో 114 ర్యాంక్​ ఆటగాడైన అస్లాన్​ కరాట్సేవ్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

సెరెనా X సిమోనా

మహిళల సింగిల్స్​లో రెండో సీడ్​ సిమోనా హలెప్​ 3-6, 6-1, 6-4 తేడాతో ఫ్రెంచ్​ ఓపెన్​ ఛాంపియన్​ ఇగా స్వైటెక్​ను ఓడించి క్వార్టర్స్​లోకి అడుగుపెట్టింది. ఈమె క్వార్టర్స్​లో స్టార్​ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్​తో పోటీ పడనుంది. అంతకుముందు మాజీ 7వ ర్యాంకర్​ ఆర్యానా సబాలెంకాతో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది సెరెనా. 6-4, 2-6, 6-4 తేడాతో సబాలెంకాపై ఆధిపత్యం కనబర్చిన ఈ నల్లకలువ.. రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్​స్లామ్​ టైటిల్​కు చేరువైంది. గతంలో ఏడు సార్లు ఆస్ట్రేలియన్​ ఓపెన్​ను నెగ్గిన 39 ఏళ్ల సెరెనా.. ఎనిమిదో సారి ఈ టోర్నీలో జయకేతనం ఎగురవేయాలని ఊవిళ్లూరుతోంది.

ఈ గ్రాండ్​స్లామ్​లో టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన నవోమి ఒసాకా.. మూడో రౌండ్​లో రాడ్​ లావర్ అరెనాపై 4-6, 6-4, 7-5 తేడాతో చెమటోడ్చి నెగ్గింది.

ఇవీ చదవండి:

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో అనుకోని అతిథి

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ముగిసిన భారత్​ కథ

Last Updated : Feb 14, 2021, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.