డిఫెండింగ్ ఛాంపియన్, నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా నాలుగో రౌండ్లో ఆడలేకపోయిన ఈ సెర్బియా స్టార్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
వావ్రింకాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో మూడో సెట్ జరుగుతున్న సమయంలో గాయంతో ఇబ్బంది పడ్డాడు జకోవిచ్. అప్పటికే ఈ మ్యాచ్‌లో 6-4, 7-5, 2-1 తేడాతో వెనుకబడ్డాడు. క్వార్టర్ ఫైనల్లో మెద్వదేవ్‌తో తలపడనున్నాడు వావ్రింకా.
-
6-4, 7-5, 2-1 (ret.)@stanwawrinka returns to the QF after Djokovic retires from the match.#USOpen pic.twitter.com/3cGoWzcE0b
— US Open Tennis (@usopen) September 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">6-4, 7-5, 2-1 (ret.)@stanwawrinka returns to the QF after Djokovic retires from the match.#USOpen pic.twitter.com/3cGoWzcE0b
— US Open Tennis (@usopen) September 2, 20196-4, 7-5, 2-1 (ret.)@stanwawrinka returns to the QF after Djokovic retires from the match.#USOpen pic.twitter.com/3cGoWzcE0b
— US Open Tennis (@usopen) September 2, 2019
చివరగా జరిగిన ఐదు గ్రాండ్ స్లామ్లలో నాలుగింటిని గెలిచి జోరు మీదున్న జకోవిచ్ ఇలా వైదొలగడం అతడికి నిరాశ కలిగించేదే.
జకోవిచ్ యూఎస్ ఓపెన్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు. అంతా సవ్యంగా ఉంటే సెమీ ఫైనల్లో ఫెదరర్‌తో పోటీ పడేవాడీ ఆటగాడు. ఈ మ్యాచ్ కోసం టెన్నిస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది.
ఇవీ చూడండి.. భావోద్వేగభరితం.. ఆ టెన్నిస్ మ్యాచ్