ETV Bharat / sports

'బ్రయాంట్​.. నీవు చెప్పినట్లే గొప్పదాన్ని అవుతా'

ఈ ఏడాది యూఎస్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​ విజేతగా ఆవిర్భవించింది నయోమీ ఒసాకా. అయితే మ్యాచ్​ అనంతరం జరిగే మీడియా సమావేశానికి దిగ్గజ బాస్కెట్​బాల్​ ప్లేయర్​ కోబ్​ బ్రయాంట్​ జెర్సీ ధరించి వచ్చింది. జనవరిలో హెలికాప్టర్​ ప్రమాదంలో తన కూతురుతో సహా ప్రాణాలు కోల్పోయారు బ్రయాంట్​.

US Open champion Osaka wears Kobe Bryant jersey at post-match press conference
యూఎస్​ ఓపెన్​ గెలిచాక.. బ్రయాంట్ జెర్సీ ధరించిన ఒసాకా
author img

By

Published : Sep 13, 2020, 4:46 PM IST

జపాన్​ టెన్నిస్​ ప్లేయర్​ నయోమీ ఒసాకా.. దివంగత దిగ్గజ బాస్కెట్​బాల్​ ప్లేయర్​ కోబ్​ బ్రయాంట్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. తాజాగా యూఎస్​ ఓపెన్​ టైటిల్​ గెలిచిన ఆమె.. మీడియా సమావేశానికి బ్రయాంట్​ జెర్సీ ధరించి వచ్చింది.

US Open champion Osaka wears Kobe Bryant jersey at post-match press conference
బ్రయాంట్ జెర్సీ ధరించిన ఒసాకా

"బ్రయాంట్​.. నేను ఎలా ఉంటానని అనుకున్నారో అలాగే ఉండాలనుకుంటున్నా. ఆయన నన్ను గొప్పదానివి అవుతావని అనేవారు. కచ్చితంగా భవిష్యత్తులో అలానే​ అవుతా."

- నయోమీ ఒసాకా, టెన్నిస్​ ప్లేయర్​

యూఎస్​ ఓపెన్​ ఫైనల్లో విక్టోరియా అజరెంకాపై గెలిచిన ఒసాకా.. కెరీర్​లో మూడో గ్రాండ్​స్లామ్​ అందుకుంది. ఈ మ్యాచ్​లో 1-6, 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది ఒసాకా. తద్వారా మూడూ గ్రాండ్​స్లామ్​లు గెలిచిన తొలి ఆసియా ప్లేయర్​గానూ ఘనత సాధించింది.

ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో మృతి చెందారు ఎన్​బీఏ లెజెండ్​ కోబ్​ బ్రయాంట్​. 41 ఏళ్ల కోబ్​..9 మంది సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్​లో ప్రయాణిస్తుండగా అమెరికా కాలిఫోర్నియాలోని కలాబసాస్​ కొండ ప్రాంతంలో అది కుప్పకూలింది. ఈ ఘటనలో కోబ్​తో పాటు అతని 13 ఏళ్ల కుమార్తె జియాన్నా కూడా ప్రాణాలు కోల్పోయారు. 'బ్లాక్​ మాంబా'గా బాస్కెట్​బాల్​ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ దిగ్గజం.. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ఆటతో అభిమానులను అలరించారు. అత్యధిక గోల్స్​ సాధించిన టాప్​ ప్లేయర్లలో కోబ్​ ఒకడిగా ఘనత సాధించారు.

దిగ్గజ ప్లేయర్​ కోబ్​ బ్రయాంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.