ETV Bharat / sports

క్వారంటైన్​ ముగిసే.. ప్రాక్టీస్​ ప్రారంభమాయే.. - practice matches before australian open

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొననున్న ఆటగాళ్ల క్వారంటైన్​ శనివారంతో ముగిసింది. దీంతో ఆదివారం నుంచి క్రీడాకారుల ప్రాక్టీస్ నిమిత్తం​ రెండు డబ్ల్యూటీఏ టోర్నీలు జరుగనున్నాయి. ఇప్పటికే అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్​లు నిర్వహించారు.

There will be two WTA tournaments for the practice of the players participating in the Australian Open
క్వారంటైన్​ ముగిసే.. ప్రాక్టీస్​ ప్రారంభమాయే..
author img

By

Published : Jan 31, 2021, 8:52 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు ముందే టెన్నిస్​ సందడి షురూ కానుంది. శనివారంతో ఆటగాళ్లందరి క్వారంటైన్​ గడువు ముగిసింది. దీంతో ఆదివారం నుంచి క్రీడాకారుల సాధన కోసం రెండు డబ్ల్యూటీఏ టోర్నీలు ఆరంభం కానున్నాయి. ఓ టోర్నీలో ప్రపంచ నంబర్​వన్​ ఆష్లీ బార్టీకి తొలి రౌండ్​లో బై లభించనుంది. మంగళవారం నుంచి అదే వేదికలో ఏటీపీ కప్​ మొదలు కానుంది. 12 జట్లు తలపడే ఆ టోర్నీలో జకోవిచ్, నాదల్​ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ దేశాల తరఫున ఆడనున్నారు. మరోవైపు వచ్చే నెల 8న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు ముందే రెండు ఓటీపీ పురుషుల టోర్నీలు జరగనున్నాయి.

14 రోజుల క్వారంటైన్​లో గడిపిన ప్లేయర్లకు ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు ముందు ప్రాక్టీస్​ ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నీలన్నీ నిర్వహించనున్నారు. ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారుల కోసం నిర్వహించిన ఎగ్జిబిషన్​ టోర్నీలో.. ఒసాకాపై సెరెనా, బార్టీపై హలెప్​ నెగ్గారు. థీమ్​ను నాదల్​ ఓడించాడు. క్వారంటైన్​ నుంచి బయటకు వచ్చిన ఆటగాళ్లు.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు సన్నద్ధమయేందుకు తొమ్మిది రోజుల సమయం ఉందని, అందరికీ మ్యాచ్​ ప్రాక్టీస్​ దక్కేలా చూస్తామని ఆ టోర్నీ సీఈఓ క్రెయింగ్​ టిలీ పేర్కొన్నాడు. టోర్నీ తొలి ఎనిమిది రోజులు స్టేడియానికి 30 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఫైనల్స్​కు మాత్రం పగటి పూట 12,500 మందిని, రాత్రి పూట 12,500 మందిని అనుమతిస్తారు.

ఇదీ చదవండి: బుమ్రా.. కుంబ్లేలా​ బౌలింగ్​ వేస్తే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.