ETV Bharat / sports

నెట్టింట పేస్ నయా ఛాలెంజ్.. జర దేఖో

కరోనా లాక్​డౌన్​ కారణంగా క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా వారి అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఖాళీ సమయం రావటం వల్ల కొన్ని వ్యాపకాలతో నెట్టింట ఛాలెంజ్​లు విసురుతున్నారు. టెన్నిస్​ క్రీడాకారుడు లియాండర్​ పేస్​ తాజాగా 'ఫ్రైయింగ్​పాన్​ఛాలెంజ్'​ అంటూ కొత్త సవాల్ విసిరాడు.

Tennis Star Player Leanderpaes challenge in twitter #FryingpanChallenge
లియాండర్​పేస్​.. #ఫ్రైయింగ్​పాన్​ఛాలెంజ్​
author img

By

Published : Apr 9, 2020, 11:10 AM IST

ప్రముఖ భారత టెన్నిస్​ క్రీడాకారుడు లియాండర్​ పేస్​ ట్విట్టర్​ ద్వారా ఓ ఛాలెంజ్​ విసిరాడు. కరోనా లాక్​డౌన్​లో ఖాళీగా సమయం గడుపుతున్న వారి కోసమే ఇదని తెలిపాడు. 'ఫ్రైయింగ్​పాన్​ఛాలెంజ్​' పేరుతో బంతిని చూడకుండా గోడకు కొట్టాలని.. ఇలా ఎంత మంది చేస్తారో చూద్దామని ట్వీట్​ చేశాడు. బాగా ఆడినవారి వీడియోను షేర్ చేస్తానని చెప్పాడు.

ఈ ఏడాది టెన్నిస్​కు గుడ్​బై చెప్పాలనుకుంటున్నట్టు లియాండర్​పేస్​ ఇదివరకే ప్రకటించాడు. ఇకపై ఎంపిక చేసుకున్న టోర్నీల్లోనే ఆడాలనుకుంటున్నట్టు తెలిపాడు. డేవిస్​కప్​లో అత్యధిక డబుల్స్​ టైటిల్స్​ నెగ్గిన క్రీడాకారుడిగా పేస్​ చరిత్ర సృష్టించాడు. కెరీర్​లో మొత్తం 44 టైటిల్స్​తో ఘనత సాధించాడు.

ఇదీ చూడండి.. చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్​.. 2020లో వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.