ETV Bharat / sports

'థాయ్​​ ఓపెన్​లో అదరగొట్టడం ఖాయం!'

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​లో మంచి ప్రదర్శన చేస్తామని భారత బ్యాడ్మింటన్​ ఆటగాళ్లు విశ్వాసం వ్యక్తం చేశారు. యోనెక్స్​ ఓపెన్​లో పేలవంగా ఆడిన ఆటగాళ్లు.. తాజా టోర్నీలో రాణిస్తామని తెలిపారు.

Sindhu and Co look for better show after listless display in first event of Asia leg
'థాయ్​​ ఓపెన్​లో ఉత్తమ ప్రదర్శన చేస్తాం'
author img

By

Published : Jan 18, 2021, 5:40 PM IST

మంగళవారం నుంచి జరగబోయే టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​లో అంచనాల మేరకు రాణిస్తామని భారత షట్లర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వారం క్రితం జరిగిన యోనెక్స్​ థాయ్​లాండ్​ ఓపెన్​లో భారత బ్యాడ్మింటన్​ ఆటగాళ్లు అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. ఏ ఒక్క క్రీడాకారుడు కనీసం రెండో రౌండ్​ దాటలేదు.

టోక్యో ఒలింపిక్స్ పతక పోటీదారు అయిన సింధు గత రెండు నెలలుగా లండన్​లో శిక్షణ తీసుకుంది. ఆమె తొలి గేమ్​లో ప్రపంచ 12వ సీడ్​ బుసానన్​తో తలపడనుంది. గత టోర్నీలో సైనాను, బుసానన్​ ఓడించింది. ఇటీవల కొవిడ్​ నుంచి కోలుకున్న సైనా ఈ టోర్నీలోనైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఆమె మొదటి మ్యాచ్​లో నాల్గవ సీడ్​ క్రీడాకారిణి రాట్చానోక్ ఇంటానాన్​ను ఎదుర్కోనుంది.

పది నెలల అనంతరం కిదాంబి శ్రీకాంత్​ మినహా ఆటగాళ్లందరికీ టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​యే మొదటి టోర్నీ. ఈ టోర్నీలో ఒలింపిక్​ రజత విజేత పీవీ సింధు.. మొదటి రౌండ్​లోనే వెనుదిరిగింది. లండన్​ గేమ్స్​ విన్నర్​ సైనా నెహ్వాల్​ రెండో రౌండ్​లోనే చేతులెత్తేసింది. ప్రపంచ మాజీ నం.1 బ్యాడ్మింటన్​ శ్రీకాంత్​, 2014 కామన్​వెల్త్​ విజేత పారుపల్లి కశ్యప్​ గాయం కారణంగా వెనుదిరిగారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు టీకా ఇచ్చే యోచనలో స్టీల్​ సంస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.