ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రిడాకారిణి నవోమి ఒసాకా మియామి ఓపెన్‌లో ఓటమి పాలైంది. మూడో రౌండ్లో తైవాన్‌కు చెందిన వెటరన్ ప్లేయర్ సువై చేతిలో 4-6,7-6(4),6-3 తేడాతో ఓడిపోయిందీ జపనీస్ తేజం.
టాప్ సీడ్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మోకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఒకరోజు ముందే జరిగిన తన తొలి మ్యాచ్‌లో రెబెక్కాపై 6-3,1-6,6-1 తేడాతో సెరెనా గెలిచింది.
వైదొలగినందుకు బాధగా ఉంది. హార్డ్ రాక్ స్టేడియంలో నేను ఆడటం మరిచిపోలేని అనుభవం. వచ్చే సంవత్సరం కచ్చితంగా పాల్గొని రాణిస్తాను. ఇక్కడ గడిపిన సమయం అద్భుతమైంది -సెరెనా విలియమ్స్, టెన్నిస్ క్రీడాకారిణి
పురుషుల విభాగంలో ఆల్బట్పై 4-6,7-5,6-3 తేడాతో గెలిచిన స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్.. మూడో రౌండ్లోకి ప్రవేశించాడు.
రెండో సీడ్ జ్వెరేవ్ అనవసర తప్పిదాలు చేసి డేవిడ్ ఫెర్రర్ చేతిలో ఓటమి పాలయ్యడు.