ETV Bharat / sports

ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఒలింపిక్స్​​ నుంచి తప్పుకుంది. యూఎస్​ ఒలింపిక్ జాబితాలో పేరు లేని కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

serena williams, us tennis player
సెరెనా విలియమ్స్, టెన్నిస్ టెన్నిస్ ప్లేయర్​
author img

By

Published : Jun 27, 2021, 6:15 PM IST

Updated : Jun 27, 2021, 6:46 PM IST

ఒలింపిక్స్​ నుంచి టెన్నిస్ స్టార్​​ ఆటగాళ్లు ఒక్కొక్కొరుగా తప్పుకుంటున్నారు. తాజాగా.. వచ్చే నెలలో జరగనున్న ఒలింపిక్స్​కు దూరంకానున్నట్టు అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్​ ప్రకటించింది. యూఎస్​ ఒలింపిక్ జాబితాలో పేరు లేని కారణంగా తాను ఈ మెగా ఈవెంట్​ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

"నిజానికి ఒలింపిక్ జాబితాలో నా పేరు లేదు. నాకు ఈ విషయం తెలియదు. అలా అయితే నేను ఈ మెగా ఈవెంట్​లో పాల్గొనను. ఈ కారణం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి" అని సెరెనా తెలిపింది.

2012 లండన్​ ఒలింపిక్స్​లో సింగిల్స్​, డబుల్స్​లో పాల్గొన్న సెరెనా.. రెండు గోల్డ్​ మెడల్స్​ సాధించింది. దీంతో పాటు సిడ్నీ ఒలింపిక్స్​-2000లో మహిళల డబుల్స్​లో స్వర్ణం గెలిచింది ఈ 39 ఏళ్ల టెన్నిస్​ స్టార్​. 2008 బీజింగ్ ఒలింపిక్స్​లోనూ బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది. తన సోదరి వీనస్​ విలియమ్స్ జతగా డబుల్స్​లో గోల్డ్​ మెడల్స్​ సాధించింది సెరెనా. ఇక రియో వేదికగా 2016 మెగా ఈవెంట్​లో మూడో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టింది.

ఇప్పటికే రాఫెల్​ నాదల్​, డొమినిక్ థీమ్.. టోక్యో గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరో వైపు రోజర్​ ఫెదరర్​ కూడా ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేది అనుమానమేనని చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​కు ఫెదరర్​ దూరం!

Last Updated : Jun 27, 2021, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.