వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. 8 సార్లు టైటిల్ గ్రహీత సెరెనా విలియమ్స్ తుదిపోరులో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్‌తో తలపడనుంది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
-
The stage is set 🏆#Wimbledon pic.twitter.com/gYAFws1CFe
— Wimbledon (@Wimbledon) July 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The stage is set 🏆#Wimbledon pic.twitter.com/gYAFws1CFe
— Wimbledon (@Wimbledon) July 12, 2019The stage is set 🏆#Wimbledon pic.twitter.com/gYAFws1CFe
— Wimbledon (@Wimbledon) July 12, 2019
మార్గరెట్ రికార్డును సమం చేస్తుందా..?
అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు కొల్లగొట్టిన మార్గరెట్ కోర్ట్(24) రికార్డుకు అడుగు దూరంలో ఉంది సెరెనా విలియమ్స్. ఇప్పటికే 23 టైటిళ్లను వశం చేసుకుంది ఈ అమెరికా దిగ్గజం. చివరగా 2017లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ నెగ్గింది.
ఈ వింబుల్డన్‌లో క్వార్టర్స్ వరకు సులభంగా వచ్చిన సెరెనా.. సెమీస్ చేరేందుకు చెమట చిందించాల్సి వచ్చింది. అమెరికాకే చెందిన అలెసన్ రిస్కే గట్టి పోటీ నిచ్చింది. 6-4, 4-6, 6-3 తేడాతో శ్రమించి సెమీస్ చేరింది సెరెనా. సెమీస్‌లో చెక్ క్రీడాకారిణి బార్బొరాపై సులభంగా గెలిచింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 6-1, 6-2 తేడాతో విజయం సాధించింది.
గత రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజార్చుకుంది సెరెనా. 2018 వింబుల్డన్ కెర్బర్‌పై ఓడగా.. అదే ఏడాది యూఎస్ ఓపెన్‌లో నొవామి స్కాట్ చేతిలో పరాజయం చెందింది. ఈ సారి ఫైనల్లో హలెప్‌ను ఢీకొట్టనుంది. వీరిద్దరూ ఇప్పటివరకు 10 సార్లు ముఖాముఖి తలపడగా 8 సార్లు సెరెనానే గెలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి కోర్ట్ రికార్డును సమం చేయాలని అనుకుంటోంది ఈ అమెరికా దిగ్గజం.
"నేను 2014 డబ్ల్యూటీఏ ఫైనల్లో ఆమెతో(హలెప్) ఓడిపోయాను. అంత త్వరగా ఆ ఓటమిని మర్చిపోలేను. ఆమె చాలా బాగా ఆడింది. వింబుల్డన్ ఫైనల్లో ఆమె కంటే మంచి ప్రదర్శన చేసి టైటిల్ నెగ్గుతాను" -సెరెనా విలియమ్స్, అమెరికా క్రీడాకారిణి.
తొలి వింబుల్డన్ ఫైనల్ ఆడనున్న హలెప్..
తొలిసారి వింబుల్డన్‌లో ఫైనల్ చేరింది హలెప్. మొదటి రౌండ్ నుంచి సులభంగా నెగ్గుకుంటూ వస్తున్న హలెప్ క్వార్టర్స్‌లో కాస్త కష్టపడింది. షూయై జాంగ్‌పై(చైనా) తలపడి తొలి సెట్లో చెమట చిందించి గెలిచింది. రెండో సెట్లో సత్తా చాటింది హలెప్. సెమీస్‌లో ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినాపై 6-1, 6-3 తేడాతో నెగ్గింది.
గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గి తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది హలెప్. డబ్ల్యూటీఏలో 17 సార్లు రన్నరప్‌గా నిలిచిన హలెప్ వింబుల్డన్‌పై కన్నేసింది. అయితే రికార్డుల ప్రకారం సెరెనా విలియమ్స్ ముందున్న నేపథ్యంలో ఇవేమి పట్టించుకోవట్లేదని తెలిపింది. ప్రస్తుతం ఆటపైనే దృష్టి పెట్టానంటోంది ఈ మాజీ నెంబర్ వన్.
"ఆమెను(సెరెనా) కట్టడి చేయడం కంటే వింబుల్డన్‌లో నేను గెలిచేందుకే చూస్తున్నా. ప్రస్తుతం నా ఆటపైనే దృష్టి పెట్టాను. " -సిమోనా హలెప్, రొమేనియా క్రిడాకారిణి
24వ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సెరెనా, తొలిసారి ఫైనల్ ఆడుతున్న హలెప్ వింబుల్డన్‌పై కన్నేశారు. వీరిద్దరిలో గెలుపెవరిదో కొన్ని గంటల్లో తేలనుంది.
ఇది చదవండి: వింబుల్డన్: పురుషుల ఫైనల్లో ఫెదరర్ X జకోవిచ్