ETV Bharat / sports

'నా తుది శ్వాస వరకు నీతోనే ఉంటా..' - ఇజాన్‌ మీర్జా మాలిక్​

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌ బుధవారం తన మొదటి పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా భావోద్వేగంతో ఓ పోస్టు పెట్టింది సానియా.

'నా తుది శ్వాస వరకు నీతోనే ఉంటా..'
author img

By

Published : Oct 30, 2019, 8:09 PM IST

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌... బుధవారం మొదటి పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో తన కొడుకు పుట్టినప్పుడు ఎలా ఉండేవాడో చూపిస్తూ ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది సానియా. అంతేకాకుండా తన సోదరి ఆనమ్‌తో ఇజాన్‌ ఆడుకుంటున్న వీడియోనూ షేర్‌ చేసింది. 'నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా..' అని సానియా మీర్జా తన కుమారుడి గురించి భావోద్వేగంతో ఇన్​స్టాలో ఓ సందేశం పెట్టింది.

"సరిగ్గా ఏడాది క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చిన నువ్వు.. ఇప్పుడు నా ప్రపంచం అయ్యావు. తొలిసారి నవ్వినప్పటి సందర్భం నాకిప్పటికీ గుర్తే. నువ్వెక్కడికెళ్లినా ఇదే నవ్వును కొనసాగించాలి. నా అమేజింగ్‌ బాయ్..ఐలవ్యూ. నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటా. జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించే విధంగా నిన్ను ఆశీర్వదించాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా."
-- సానియామీర్జా, భారత టెన్నిస్​ క్రీడాకారిణి

సానియా చేసిన పోస్టుకు స్పందించిన బాలీవుడ్‌ తారలు హుమా ఖురేషీ, నేహా ధూపియా... ఇజాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

రీఎంట్రీ కోసం...

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో మళ్లీ అంతర్జాతీయ టోర్నీలో ఆడబోతోంది. ఇందుకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న ఈ హైదరాబాద్​ భామ.. 4 నెలల్లో 26 కేజీల బరువు తగ్గింది. 2017లో చైనా ఓపెన్‌లో చివరిసారి భారత్‌ తరఫున ఆడింది సానియా. 2020 జనవరిలోపు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటానని ఇటీవలే చెప్పిందీ స్టార్​ ప్లేయర్​.

AP Video Delivery Log - 1300 GMT News
Wednesday, 30 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1212: UK Election Analyst AP Clients Only 4237389
Analyst warns UK election may result in hung parliament
AP-APTN-1158: Saudi Arabia Brazil AP Clients Only 4237386
Brazil president blasts criticism of his Amazon policies
AP-APTN-1127: Syria Russian Forces AP Clients Only 4237376
Russian forces patrol Turkey-Syria border
AP-APTN-1124: STILLS UK Bodies Brothers Wanted AP Clients Only 4237377
UK police seek 2 brothers in container death case
AP-APTN-1123: Hungary NATO AP Clients Only 4237379
Hungary vetoes NATO joint statement on Ukraine
AP-APTN-1114: Iraq Baghdad Protest AP Clients Only 4237365
Coffin of dead protester carried through Baghdad
AP-APTN-1108: Vatican Pope Iraq AP Clients Only 4237374
Pope urges Iraqi authorities to listen to 'cry of population'
AP-APTN-1102: UK Labour McDonnell No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4237358
UK shadow chancellor on why Labour backs election
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.