దిగ్గజ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. వచ్చే నెల జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్‌పై స్పష్టత ఇచ్చాడు. జెనీవాతో పాటు పారిస్ ఓపెన్లలో తాను పాల్గొననున్నట్లు వెల్లడించాడు.
మోకాలి శస్త్ర చికిత్సల అనంతరం ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు ఈ స్విస్ ఆటగాడు. ఆ తర్వాత గత నెలలో జరిగిన ఖతార్ ఓపెన్‌లో ఆడిన రోజర్.. క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. జార్జియా ప్లేయర్ నికోలస్ బసిల్ష్విలి చేతిలో ఓటమి పాలయ్యాడు. అత్యుత్తమ శిక్షణ కోసం దుబాయ్ టోర్నమెంట్ నుంచి కూడా తప్పుకొన్నాడు.
"జెనీవా, పారిస్ ఓపెన్లలో ఆడుతున్నానని తెలియజేయటం సంతోషంగా ఉంది. అప్పటి వరకు ఉన్న సమయాన్ని శిక్షణ కోసం ఉపయోగిస్తాను" అని ఫెదరర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
-
Hi everyone!
— Roger Federer (@rogerfederer) April 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy to let you know that I will play Geneva🇨🇭 and Paris 🇫🇷. Until then I will use the time to train. Can’t wait to play in Switzerland again. ❤️🚀
">Hi everyone!
— Roger Federer (@rogerfederer) April 18, 2021
Happy to let you know that I will play Geneva🇨🇭 and Paris 🇫🇷. Until then I will use the time to train. Can’t wait to play in Switzerland again. ❤️🚀Hi everyone!
— Roger Federer (@rogerfederer) April 18, 2021
Happy to let you know that I will play Geneva🇨🇭 and Paris 🇫🇷. Until then I will use the time to train. Can’t wait to play in Switzerland again. ❤️🚀
ఇదీ చదవండి: టీ20 వరల్డ్‌కప్‌లో డివిలియర్స్ రీ-ఎంట్రీ!
ఇదీ చదవండి: బుమ్రా.. డెత్ ఓవర్స్ రక్షకుడు!