ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: సెరెనా, నాదల్​ శుభారంభం - డొమినిక్​ ధీమ్

ఫ్రెంచ్​ ఓపెన్​ ఫెవరెట్‌ రఫెల్‌ నాదల్‌ తన జోరును మొదలెట్టాడు. రోజర్‌ ఫెదరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును (20) సమం చేసేందుకు తహతహలాడుతున్న నాదల్​.. టోర్నీలో శుభారంభం చేశాడు. యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ కూడా బోణీ కొట్టాడు. మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌, స్వితోలినా రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

Record-chasing Nadal eases into French Open second round
ఫ్రెంచ్​ ఓపెన్​: సెరైనా, నాదల్​ శుభారంభం
author img

By

Published : Sep 29, 2020, 6:35 AM IST

Updated : Sep 29, 2020, 7:43 AM IST

క్లే కింగ్‌ రెండో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. సోమవారం మొదటి రౌండ్లో గెరాసిమోవ్‌ (బెలారస్‌)పై 6-4, 6-4, 6-2తో విజయం సాధించాడు. మ్యాచ్‌లో మూడు ఏస్‌లు సంధించిన నాదల్‌, 32 విన్నర్లు కొట్టాడు. మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై 6-4, 6-3, 6-3 తేడాతో గెలిచాడు. థీమ్‌ మూడు ఏస్‌లు కొట్టాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేశాడు.

యుఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌, ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. తొలి రౌండ్లో అతడు 7-5, 6-2, 6-4తో డెన్నిస్‌ నొవాక్‌ (ఆస్ట్రియా)ను ఓడించాడు. జ్వెరెవ్‌ పది ఏస్‌లు సంధించాడు. మరో మ్యాచ్‌లో ఫోగ్నిని (ఇటలీ) 7-5, 3-6, 7-6 (7-1), 6-0తో కుకుష్కిన్‌ (కజకిస్థాన్‌)పై విజయం సాధించాడు. హెర్బర్ట్‌, గాస్టన్‌, సానెజో, పాల్‌, మార్టినెజ్‌, నిషియోకా, వెస్లీ, మెక్‌డొనాల్డ్‌ కూడా తొలి రౌండ్‌ను అధిగమించారు. ఎనిమిదో సీడ్‌ మోన్‌ఫిల్స్‌ ఓడిపోయాడు.

క్విటోవా ముందంజ

మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా), మూడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్లో సెరెనా 7-6 (7-2), 6-0తో ఆన్‌ (అమెరికా)పై విజయం సాధించింది. తొలి సెట్లో శ్రమించిన ఆమె.. రెండో సెట్లో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మ్యాచ్‌లో ఆమె 11 ఏస్‌లు, 26 విన్నర్లు కొట్టింది. ఇక స్వితోలినా 7-6 (7-2), 6-4తో గ్రచేవా (రష్యా)ను ఓడించింది. ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌) కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 6-3, 7-5తో దొదిన్‌ (ఫ్రాన్స్‌)ను మట్టికరిపించింది.

కోరె గాఫ్‌ (అమెరికా) 6-3, 6-3తో తొమ్మిదో సీడ్‌ కొంటా (బ్రిటన్‌)కు షాకిచ్చింది. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ బెర్టెన్స్‌ (నెదర్లాండ్స్‌) 2-6, 6-2, 6-0తో జవాస్క (ఉక్రెయిన్‌)పై, జాంగ్‌ (చైనా) 6-3, 7-6 (7-2)తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై, పిరన్కోవా (బల్గేరియా) 6-3, 6-3తో పెట్కోవిచ్‌ (జర్మనీ)పై విజయం సాధించారు. ముగురుజ, పవ్లిచెంకోవా, పెరా, సినియాకోవా, పయోలిని కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మాజీ నం.1 కెర్బర్‌ ఓడిపోయింది

Last Updated : Sep 29, 2020, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.