ETV Bharat / sports

French Open: మూడో రౌండ్​కు రఫెల్​ నాదల్​

13సార్లు రోలాండ్​ గారోస్​(ఫ్రెంచ్​ ఓపెన్​)(French Open) ఛాంపియన్​గా నిలిచిన రఫెల్​ నాదల్(Rafael Nadal)​.. రెండో రౌండ్​లో అవలీలగా గెలుపొంది.. మూడో రౌండ్​కు చేరుకున్నాడు. స్థానిక టెన్నిస్​ క్రీడాకారుడు పాట్​ రిచర్డ్​ గ్యాస్క్వైట్​(Richard Gasquet)పై రెండోరౌండ్​లో గెలుపొంది.. టోర్నీలో తర్వాతి రౌండ్​కు అర్హత సాధించాడు.

author img

By

Published : Jun 4, 2021, 11:41 AM IST

Rafael Nadal demolishes Gasquet to reach French Open third round
French Open: మూడో రౌండ్​కు రఫెల్​ నాదల్​

క్లే కోర్టు మెషీన్​ రఫెల్​ నాదల్(Rafael Nadal)​ తన 35వ పుట్టినరోజును విజయంతో ప్రారంభించాడు. ఫ్రెంచ్​ఓపెన్​(French Open)లో గురువారం జరిగిన మ్యాచ్​లో స్థానిక టెన్నిస్​ ఆటగాడు రిచర్డ్​ గ్యాస్క్వెట్​పై 6-0, 7-5, 6-2 తేడాతో గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్​ టోర్నీలోని మూడో రౌండ్​కు దూసుకెళ్లాడు.

అయితే 1999లో జరిగిన టూర్నోయి డెస్ పెటిట్స్ అండర్​-14 సెమీస్​లో రిచర్డ్​ గ్యాస్క్వైట్​(Richard Gasquet)పై తలపడిన నాదల్​ అందులో ఓడాడు. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్​లో ఇప్పుడు నాదల్​ పైచేయి సాధించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 13సార్లు విజేతగా నిలిచిన నాదల్​.. మరోసారి టైటిల్​ను సొంతం చేసుకునే విధంగా దూకుడుగా ఆడుతున్నాడు.

ఇదీ చూడండి: French Open: మూడో రౌండ్​కు జకోవిచ్​, ఫెదరర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.