యూఎస్ ఓపెన్‌లో(US Open 2021) సంచలనాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ ఒసాక (జపాన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. 19 ఏళ్ల కెనడా అమ్మాయి ఫెర్నాండెజ్ 5-7, 7-6 (7-2), 6-4 తేడాతో ఒసాకాపై(Osaka vs Fernandez) గెలిచింది. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ తొలి సెట్ సొంతం చేసుకున్న ఒసాక.. మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ రెండో సెట్లో గొప్పగా పోరాడిన ఫెర్నాండెజ్ టైబ్రేకర్‌లో పైచేయి సాధించింది. ఇక మూడో సెట్లో చెలరేగిన ఆమె.. విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు రెండో సీడ్ సబలెంక (బెలారస్) 6-3, 6-3తో కొలిన్స్ (యూఎస్)పై గెలిచి(Sabalenka vs Collins) ప్రీక్వార్టర్స్ చేరింది. అజరెంకా (బెలారస్)పై నెగ్గిన మురుగుజా (స్పెయిన్)తో పాటు కెర్బర్ (జర్మనీ), క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్), మార్టిన్స్ (బెల్జియం) కూడా మూడో రౌండ్ దాటారు.
4 గంటలు పోరాడినా
పురుషుల సింగిల్స్‌లో తీవ్ర ఉత్కంఠగా సాగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)(Tsitsipas US Open) 3-6, 6-4, 6-7 (2-7), 6-0, 6-7 (5-7)తో 18 ఏళ్ల కార్లోస్ (స్పెయిన్) చేతిలో పోరాడి ఓడాడు. 4 గంటలకు పైగా సాగిన ఈ పోరు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చివరకు అయిదో సెట్లో అదీ టైబ్రేకర్‌లో తేలిన ఫలితం సిట్సిపాస్‌ను ఓటమి వైపు నెట్టింది. అయిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6-4, 3-6, 6-7 (6-8), 6-4, 1-6తో ఫ్రాన్సెస్ (యూఎస్) చేతిలో ఓడాడు. రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), అగర్ (కెనడా), ష్వార్జ్‌మన్ (అర్జెంటీనా) ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
ఇదీ చదవండి:Us Open: జకో మరో అడుగు.. ప్రీక్వార్టర్స్‌కు హలెప్