టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. ఆర్థర్ ఆశే స్టేడియంలో బోస్నియా అండ్ హర్జెగోవినా ఆటగాడు డామిర్ జుముర్‌తో తలపడిన తొలి రౌండ్‌లో 6-1, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు.
దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్.. ప్రత్యర్థికి ఏ నిమిషంలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. తన డిఫెన్స్‌తో జుముర్‌ను పూర్తిగా కట్టడిచేశాడు. ఈ ఏడాది ఇప్పటికే వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచాడు జకో. ఈ గెలుపుతో తన గణంకాలను 24-0తో మరింత మెరుగు పర్చుకున్నాడు.