ETV Bharat / sports

US Open 2021: జకో మరో అడుగు- క్వార్టర్స్​లోకి ఎంట్రీ - నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్

యూఎస్​ ఓపెన్​లో(US Open 2021) టాప్​సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic News) మరో అడుగు ముందుకు వేశాడు. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు ప్లిస్కోవా, సకారి కూడా ముందంజలో ఉన్నారు.

novak djokovic
నొవాక్ జకోవిచ్
author img

By

Published : Sep 8, 2021, 6:41 AM IST

Updated : Sep 8, 2021, 7:54 AM IST

యూఎస్‌ ఓపెన్లో(US Open 2021) టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌(Novak Djokovic News ) దూసుకెళ్తున్నాడు. ఈ టాప్‌సీడ్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో జకో 1-6, 6-3, 6-2, 6-2తో అన్‌సీడెడ్‌ బ్రూక్స్‌బీ (అమెరికా)ని ఓడించాడు. ఈ పోరులో తొలి సెట్లో జకో తడబడ్డాడు. అనవసర తప్పులు చేస్తూ ప్రత్యర్థికి పాయింట్లు అప్పగించాడు. ఏడు గేమ్‌లలో ఆరు గేమ్‌లను సొంతం చేసుకున్న బ్రూక్స్‌బీ తొలి సెట్‌ గెలిచి జకోకు ఝలక్‌ ఇచ్చాడు. తొలి సెట్లో జకో 11 అనవసర తప్పిదాలు చేశాడు. కానీ రెండో సెట్‌ నుంచి నొవాక్‌ పుంజుకున్నాడు. ఆరంభంలోనే బ్రూక్స్‌బీ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లిన అతడు.. అదే జోరుతో సెట్‌ గెలిచాడు.

మూడు, నాలుగు సెట్లలో ఒక్కోసారి బ్రూక్స్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జకో(Novak Djokovic US Open 2021) ఈ రెండు సెట్లతో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జకో 9 ఏస్‌లతో పాటు 45 విన్నర్లు కొట్టాడు. క్వార్టర్స్‌లో ఇటలీ కుర్రాడు బెరిటినితో జకో తలపడనున్నాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో ఆరోసీడ్‌ బెరిటిని 6-4, 3-6, 6-3, 6-2తో ఒటీ (జర్మనీ)పై విజయం సాధించాడు. జ్వెరెవ్‌ (జర్మనీ) కూడా తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ నాలుగో సీడ్‌ 6-4, 6-4, 7-6 (9/7)తో పదమూడో సీడ్‌ సినర్‌ (ఇటలీ)పై విజయం సాధించాడు. ఈ పోరులో 17 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్‌.. మూడుసార్లు సినర్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. అన్‌సీడెడ్‌ లాయెడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా) కూడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. అతడు 6-7 (6/8), 6-4, 6-1, 6-3తో ఒపెల్కా (అమెరికా)ను ఓడించాడు.

sakkari
సకారి

సకారి ముందంజ: గ్రీసు అమ్మాయి సకారి(Sakkari Tennis) క్వార్టర్స్‌లో చేరింది. మూడున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సకారి 6-7 (2/7), 7-6 (8/6), 6-3తో కెనడా కెరటం ఆండ్రెస్క్యూపై కష్టపడి గెలిచింది. ఈ పోరులో ఆరుసార్లు సర్వీస్‌ కోల్పోవడమే కాక.. 41 అనవసర తప్పిదాలు చేసిన ఆండ్రెస్క్యూ ఓటమిని కొని తెచ్చుకుంది. ప్లిస్కోవా (చెక్‌) 7-5, 6-4తో పవ్లిచెంకోవా (రష్యా)పై నెగ్గగా.. ఎమా రద్‌కాను (బ్రిటన్‌) కూడా క్వార్టర్స్‌ చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో 18 ఏళ్ల రద్‌కాను 6-2, 6-1తో షెల్బీ రోజర్స్‌పై విజయం సాధించింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఈ దశకు రావడం ఈ బ్రిటన్‌ అమ్మాయికి ఇదే తొలిసారి. వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరడమే ఆమె ఉత్తమ ప్రదర్శన.

ఇదీ చదవండి:శిఖర్​ ధావన్​ దంపతులు విడిపోయారా?

Last Updated : Sep 8, 2021, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.