ETV Bharat / sports

కరోనా నుంచి కోలుకున్న టెన్నిస్​ స్టార్​ జకోవిచ్​

సెర్బియా టెన్నిస్​ స్టార్ నొవాక్​ జకోవిచ్​తో​ అతడి భార్య కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవలే చేసిన వైద్యపరీక్షల్లో వారికి నెగిటివ్​గా తేలింది.

author img

By

Published : Jul 2, 2020, 8:40 PM IST

jokovic
జకోవిచ్​

టెన్నిస్​ స్టార్​ నొవాక్​ జకోవిచ్,​ అతడి భార్య.. ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన వైరస్​ నిర్థరణ పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చింది.​ వైరస్ సోకిందని తేలిన తర్వాత వీరిద్దరూ పదిరోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

ఇటీవలే బాల్కాన్​లో జకోవిచ్​ ఆధ్వర్యంలో ఆడ్రియా టెన్నిస్​ టోర్నీ​ జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారులు విక్టర్​, అతడి భార్య, ద్రిమితోవ్​, బోర్నా కోరిక్​, జకోవిచ్​, అతని భార్యకు కరోనా సోకింది. దీంతో వీరందరూ క్వారంటైన్​లోకి ఉన్నారు.

అయితే కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలోనూ ఆటగాళ్లను ఓ చోటకు చేర్చి టోర్నీ నిర్వహించిన తీరుపై జకోవిచ్​పై​ తీవ్రవిమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఈ విషయంపై స్పందించిన జకోవిచ్​ క్షమాపణలు కూడా చెప్పాడు.

Novak Djokovic and wife
నొవాక్​ జకోవిచ్​ అతడి భార్య

ఇది చూడండి : టెన్నిస్​ స్టార్​ నొవాక్​ జకోవిచ్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.