ETV Bharat / sports

Naomi Osaka: అభిమానులకు ఒసాకా థాంక్స్​ - ఫ్రెంచ్ ఓపెన్

తన పట్ల ప్రేమతో పాటు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది ప్రపంచ రెండో సీడ్​ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా. ఫ్రెంచ్ ఓపెన్​ నుంచి వైదొలిగిన ఐదు రోజుల తర్వాత ఆమె స్పందించింది.

naomi osaka, japan tennis player
నవోమి ఒసాకా, జపాన్ టెన్నిస్ ప్లేయర్
author img

By

Published : Jun 6, 2021, 1:58 PM IST

తనపై ప్రేమ చూపిస్తూ, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు తెలిపింది జపాన్ టెన్నిస్ ప్లేయర్​ నవోమి ఒసాకా. మానసిక సమస్యలతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన ఐదు రోజుల తర్వాత ఒసాకా ఈ మేరకు స్పందించింది.

ఫ్రెంచ్ ఓపెన్​ తొలి రౌండ్​లో పార్టిసియా మారియాపై విజయం సాధించిన ఒసాకా.. తర్వాత నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన నిర్వాహకులు ఆమెకు 15వేల డాలర్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది ఒసాకా.

ఇదీ చదవండి: French Open: ఒసాకా వైదొలగడానికి కారణమిదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.