స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు జిస్కా పెరెల్లోను శనివారం వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లితో వీరి 14 ఏళ్ల బంధానికి మరో ముందడుగు పడినట్లయింది.
స్పెయిన్‌లోని మయోర్కాలో జరిగిన ఈ వివాహ వేడుక అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగింది. సుమారు 350 మంది బంధుమిత్రులు వచ్చినట్లు సమాచారం.
తన సోదరి మారిబెల్ ద్వారా నాదల్కు పెరెల్లోతో పరిచయమైంది. అనంతరం వీరిద్దరూ స్నేహితులయ్యారు. 14 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడా బంధాన్ని పెళ్లిగా మార్చారు.
33 ఏళ్ల రఫా 19 గ్రాండ్‌స్లామ్‌లను సొంతం చేసుకున్నాడు. ఇందులో 12 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు, యూఎస్ఓపెన్నూ కైవసం చేసుకున్నాడు నాదల్. ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన రెండో టెన్నిస్ ప్లేయర్‌గా ఘనత అందుకున్నాడు. అతడికంటే ముందు రోజర్ ఫెదరర్(20) ఉన్నాడు.
ఇదీ చదవండి: పాక్ చిన్నారికి గౌతమ్ గంభీర్ సాయం