అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్(ఏటీపీ) సోమవారం టెన్నిస్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో పురుషుల సింగిల్స్ విభాగంలో నొవాక్ జకోవిచ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నాదల్ రెండో స్థానంలో ఉన్నాడు.
బ్రిటీష్ స్టార్ ఆండీ ముర్రే 214 పైచిలుకు స్థానాలు మెరుగుపరుచుకుని 289వ ర్యాంకుకు చేరాడు. ఇటీవల ప్రదర్శన లేమితో వెనుకంజలో ఉన్న ముర్రే.. చైనా ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఈ టోర్నీకి ముందు 503వ స్థానంలో ఉన్నాడు.
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మూడో స్థానంలో ఉన్నాడు. రష్యాకు చెందిన మెద్వదేవ్ నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రియా ఆటగాడు డొమనీస్ థీమ్ 5వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
మూడుకు చేరిన ఒసాకా..
మహిళల విభాగంలో జపాన్‌కు చెందిన నయోమీ ఒసాకా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 3వ స్థానానికి చేరింది. చైనా ఓపెన్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ ఆష్లీ బార్టీని ఓడించి ఈ ఘనత సాధించింది. అయితే బార్టీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
కరోలినా ప్లిస్కోవా(చెక్) రెండో స్థానంలో ఉండగా.. యూఎస్ ఓపెన్ విజేత బియాంకా ఆండ్రిస్కు ఒక స్థానానికి ఎగబాకి 5వ ర్యాంకులో నిలిచింది. సిమోనా హాలెప్ ఓ స్థానం వెనక్కి తగ్గి 6వ స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: దుర్గామాతకు బాలీవుడ్ తారల ప్రత్యేక పూజలు