ప్రముఖ టెన్నిస్ ఆటగాడు.. తన గేమ్‌కు కెమెరా అడ్డొచ్చిందని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. కోపంతో కెమెరాను తన్ని.. దానిని అక్కడి నుంచి తొలగించాలని గొడవ చేశాడు. ఇది అమెరికాలో యూఎస్ ఓపెన్ వార్మప్ మ్యాచ్‌ల సందర్భంగా చోటుచేసుకుంది.
వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా సెమీఫైనల్లో రష్యా ఆటగాళ్లు డేనియల్ మెద్వెదేవ్, రుబ్లేవ్ మధ్య హోరాహోరీగా గేమ్ జరిగింది. ఇందులో మెద్వెదేవ్ అదుపుతప్పి అక్కడే ఉన్న ఓ కెమెరావైపు దూసుకెళ్లాడు. కెమెరాను ఢీ కొట్టి కిందపడ్డాడు. దీంతో అతడికి కోపమొచ్చి, ఆ కెమెరాను కాలితో తన్నాడు. కొంచెం ఉంటే తన చెయ్యి విరిగినంత పనైందని.. ఆ కెమెరాను అక్కడి నుంచి తొలగించాలని అంపైర్‌ను డిమాండ్ చేశాడు.
ఈ సంఘటన తర్వాత మ్యాచ్‌ను కొనసాగించిన మెద్వెదేవ్.. ప్రత్యేర్థి చేతిలో ఓడిపోయాడు.
ఇదీ చదవండి : కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ధర తెలిస్తే షాక్!