ETV Bharat / sports

నాదల్, ఒసాకాను వరించిన ప్రతిష్ఠాత్మక లారస్​ అవార్డు - స్పోర్ట్స్ పర్సన ఆఫ్ ది ఇయర్​

ప్రఖ్యాత లారస్​ ప్రపంచ స్పోర్ట్స్​ అవార్డుల కార్యక్రమంలో.. 'స్పోర్ట్స్​ పర్సన్​ ఆఫ్ ది ఇయర్​' అవార్డును టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్​ గెలుపొందాడు. 'స్పోర్ట్స్​ ఉమెన్ ఆఫ్ ది ఇయర్'​గా జపాన్​ టెన్నిస్​ ప్లేయర్​ నవోమి ఒసాకా నిలిచింది.

rafel nadal, Laureus Awards
రాఫెల్ నాదల్, నవోమి ఒసాకా
author img

By

Published : May 7, 2021, 12:49 PM IST

లారస్​ ప్రపంచ స్పోర్ట్స్​ డిజిటల్​ అవార్డుల కార్యక్రమం స్పెయిన్ సెవిల్లే వేదికగా జరిగింది. 2021కి గానూ 'స్పోర్ట్స్​ పర్సన్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డును.. ప్రపంచ టెన్నిస్​ దిగ్గజం రాఫెల్​ నాదల్ గెలుచుకున్నాడు. 'స్పోర్ట్స్​ ఉమెన్ ఆఫ్ ది ఇయర్​' అవార్డును మహిళ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా కైవసం చేసుకుంది.

మరికొన్ని అవార్డులు..

  • వరల్డ్​ టీమ్​ ఆఫ్ ది ఇయర్​ అవార్డు- బేయర్న్​ మ్యూనిచ్​ ఫుట్​బాల్​ టీమ్​
  • ది అథ్లెట్​ అడ్వకేట్​ ఆఫ్ ది ఇయర్​- లూయిస్​ హామిల్టన్​, ఫార్ములా వన్​ ఛాంపియన్
  • స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్​ అవార్డు- ఎంఓ సాలా, లివర్​పూల్​ ఫుట్​బాల్​ ఆటగాడు
  • లైఫ్​టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు- బిల్లీ జీన్​ కింగ్

ఇదీ చదవండి: 'ఈ హత్య కేసులో రెజ్లర్​ సుశీల్​దే ప్రధానపాత్ర!'

ఇప్పటివరకు మొత్తం 8సార్లు నాదల్​.. ఈ అవార్డుకు నామినేట్​ అయ్యాడు. వాటిలో నాలుగు సార్లు గెలుచుకున్నాడు. ఇక ఒసాకా మూడు సార్లు నామినేట్​ కాగా.. రెండు సార్లు అవార్డును గెలుచుకుంది. ప్రఖ్యాత లారస్​ అవార్డును గెలుచుకోవడం పట్ల ఒసాకా సంతోషం వ్యక్తం చేసింది.

బేయర్న్​ మ్యూనిచ్​ ఫుట్​ బాల్​ టీమ్​ ఈ అవార్డును గెలుపొందడం ఇది రెండోసారి. 2002, 2014లలోనూ నామినేట్​ కాగా.. 2014లో అవార్డు గెలుపొందింది.

ఇదీ చదవండి: కొవిడ్​ పోరాటంలో విరుష్క జోడీ రూ.2 కోట్ల విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.