కరోనా తర్వాత వివిధ క్రీడలు వరుసగా పునఃప్రారంభమవుతున్నాయి. తాజాగా ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్న్మెంట్ షెడ్యూల్ ప్రకటించింది ఆ దేశ బోర్డు. సెప్టెంబరు 14 నుంచి 21 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం మే 11న పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడ్డాయి.
దీంతో పాటు యుఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు, ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 11 వరకు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ను ఇటీవల ప్రకటించారు. మ్యాడ్రిడ్ ఓపెన్ సెప్టెంబరు 11 లేదా 12 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఆడే ప్లేయర్ల జాబితా ఖరారు కావాల్సి ఉంది.
ఇది చూడండి 'ఐపీఎల్ సమయంలో ఫిక్సర్లపై కన్నేసి ఉంచుతాం'