కరోనా వైరస్ (కొవిడ్-19) ధాటికి క్రీడా ప్రపంచం విలవిలలాడుతోంది. ఇప్పటికే పలు క్రీడా మ్యాచ్‌లు, టోర్నీలు వాయిదా లేదా రద్దవుతుండగా.. తాజాగా ఈ జాబితాలో ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ కూడా చేరింది. మే 24 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన ఈ టోర్నీని.. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను మార్చారు.
-
⚠️The Roland-Garros tournament will be played from 20th September to 4th October 2020.#RolandGarros pic.twitter.com/eZhnSfAiQA
— Roland-Garros (@rolandgarros) March 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">⚠️The Roland-Garros tournament will be played from 20th September to 4th October 2020.#RolandGarros pic.twitter.com/eZhnSfAiQA
— Roland-Garros (@rolandgarros) March 17, 2020⚠️The Roland-Garros tournament will be played from 20th September to 4th October 2020.#RolandGarros pic.twitter.com/eZhnSfAiQA
— Roland-Garros (@rolandgarros) March 17, 2020
మహమ్మారి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న నేపథ్యంలో ఎర్రమట్టిలో ఆడే ఈ టెన్నిస్ టోర్నీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేమని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నీని వాయిదా వేయడం వల్ల ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌కు మధ్య అంతరం వారం రోజులుగా మారింది. షెడ్యూల్ ప్రకారం యుఎస్ ఓపెన్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగాల్సి ఉంది.
యూఈఎఫ్ఏ నిర్వహించే యూరో 2020, కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలు వాయిదా వేస్తూ నేడు నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఈ రెండు టోర్నీలు వచ్చే ఏడాది జూన్ 11 నుంచి జులై 11 మధ్యలో జరగనున్నాయి.