ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్.. ఫ్రెంచ్ ఓపెన్ వారం ఆలస్యం - tennis latest news

కరోనా ప్రభావం గ్రాండ్​స్లామ్​ టోర్నీపై పడింది. దీంతో వారం రోజులు ఆలస్యంగా ఫ్రెంచ్​ ఓపెన్​ మొదలు కానుంది.

French Open postponed by a week because of pandemic
కరోనా ఎఫెక్ట్.. ఫ్రెంచ్ ఓపెన్ వారం ఆలస్యం
author img

By

Published : Apr 8, 2021, 3:27 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఫ్రెంచ్ ఓపెన్ వారం రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. మట్టికోర్టులో నిర్వహించే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీని మే 23న మొదలుపెట్టాలని నిర్వాహకులు తొలుత నిర్ణయించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పుడు దానిని వారంపాటు వాయిదా వేశారు.

సురక్షితమైన వాతావరణంలో సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల మధ్య టోర్నీ నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య తెలిపింది. ఈ నిర్ణయంతో మే 30న టోర్నీ ప్రారంభమవుతుంది. గతేడాది మేలో జరగాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ను కరోనా కారణంగా 4 నెలలు వాయిదా వేసి సెప్టెంబర్‌లో నిర్వహించారు. రోజుకు 1000 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.