ETV Bharat / sports

French Open: థీమ్‌ ఇంటికి.. ఒసాకాకు జరిమానా

author img

By

Published : May 31, 2021, 7:10 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాలుగో సీడ్‌ థీమ్‌కు(Thiem) షాక్‌. 35 ఏళ్ల పాబ్లో అతడికి తొలి రౌండ్లోనే చెక్‌ పెట్టాడు. మహిళల సింగిల్స్‌లో ఒసాకా(Osaka), సబలెంక(Sabalenka)  శుభారంభం చేయగా.. మాజీ నంబర్‌ వన్‌ కెర్బర్‌ క్వాలిఫయర్‌ చేతిలో ఓడి నిష్క్రమించింది.

thiem
థీమ్‌

రెండుసార్లు రన్నరప్‌ డొమినిక్‌ థీమ్‌ Dominic Thiem (ఆస్ట్రియా) ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open) తొలి రౌండ్‌నే దాటలేకపోయాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో 27 ఏళ్ల థీమ్‌ 6-4, 7-5, 3-6, 4-6, 4-6 తేడాతో పాబ్లో అందూజర్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయంపాలయ్యాడు. రెండు వారాల క్రితం జెనీవా టోర్నీలో ఫెదరర్‌ను ఓడించిన పాబ్లో.. థీమ్‌తో పోరులోనూ అదే పట్టుదల ప్రదర్శించాడు. ప్రపంచ ర్యాకింగ్స్‌లో 68వ స్థానంలో ఉన్న పాబ్లో.. నాలుగున్నర గంటలపాటు హోరీహోరీగా సాగిన పోరులో తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకుని వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలిచాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ థీమ్‌.. దూకుడైన ఆటతో తొలి రెండు సెట్లు గెలిచి విజయం సాధించేలా కనిపించాడు. ఆ పరిస్థితుల్లోనూ పాబ్లో గొప్పగా పోరాడాడు.

మూడో సెట్లో ఓ దశలో 3-3తో స్కోరు సమం కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన అతడు మ్యాచ్‌పై ఆశలు నిలబెట్టుకున్నాడు. మరోవైపు అనవసర తప్పిదాలు చేసిన థీమ్‌ అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. నాలుగో సెట్‌ కోల్పోయిన అతను.. నిర్ణయాత్మక చివరి సెట్‌లోనూ ప్రత్యర్థిని నిలువరించలేకపోయాడు. దీంతో పరాజయం తప్పలేదు. మ్యాచ్‌లో ఆటగాళ్లిద్దరూ చెరో నాలుగు ఏస్‌లు కొట్టారు. ప్రత్యర్థి కంటే ఎక్కువగా థీమ్‌ మొత్తం 66 విన్నర్లు కొట్టినప్పటికీ.. 61 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 11వ సీడ్‌ అగట్‌ (స్పెయిన్‌) 6-4, 6-4, 6-4తో తన దేశానికే చెందిన మార్టినెజ్‌ను ఓడించి రెండో రౌండ్‌ చేరాడు. 12వ సీడ్‌ పాబ్లో బుస్టా (స్పెయిన్‌) 6-3, 6-4, 6-3తో గోంబోస్‌ (స్లోవేకియా)పై నెగ్గి ముందంజ వేశాడు. కచనోవ్‌ (రష్యా), ఫాగ్నిని (ఇటలీ) కూడా తొలి రౌండ్‌ దాటారు. మరోవైపు గిరోన్‌ (యుఎస్‌ఏ)తో తొలి రౌండ్‌ పోరులో 6-2, 6-4, 5-7, 0-3తో ఉన్న దశలో 16వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) గాయంతో తప్పుకున్నాడు. 25వ సీడ్‌ ఎవాన్స్‌ ఓటమిపాలయ్యాడు.

thiem
థీమ్‌

సబలెంక ముందుకు..:

మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ ఒసాకా (జపాన్‌), మూడో సీడ్‌ సబలెంక (బెలారస్‌) బోణీ కొట్టారు. తొలి రౌండ్లో ఒసాకా 6-4, 7-6 (7-4) తేడాతో మారియా (రొమేనియా)పై విజయం సాధించింది. బలమైన సర్వీసులు, శక్తిమంతమైన షాట్లతో వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన ఒసాకా తొలి సెట్‌లో 3-0తో దూసుకెళ్లింది. అదే జోరులో 5-2తో సులభంగా గెలిచేలా కనిపించింది. కానీ ఆ దశలో పుంజుకున్న ప్రత్యర్థి ప్రతిఘటించింది. వరుసగా రెండు గేమ్‌లు గెలిచింది. కానీ ఆ వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఒసాకా తొలి సెట్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరు క్రీడాకారిణులు పాయింట్ల కోసం తీవ్రంగా పోటీపడ్డారు. చివరకు టై బ్రేకర్‌లో ఒసాకా గెలిచింది.

ఈ పోరులో 39 విన్నర్లు కొట్టిన ఆమె.. ఓ ఎస్‌ సంధించింది. మరోవైపు సబాలెంక తొలి రౌండ్లో 6-4, 6-3 తేడాతో కొంజూ (క్రొయేషియా)పై నెగ్గింది. మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించిన ఆమె.. 24 విన్నర్లు కొట్టింది. 11వ సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-7 (3-7), 7-6 (7-5), 6-1తో మినెన్‌ (బెల్జియం)పై గెలిచి రెండో రౌండ్‌ చేరింది. మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)కు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. ఈ 26వ సీడ్‌ 2-6, 4-6తో ఉక్రెయిన్‌ క్వాలిఫయర్‌ కలినీనా చేతిలో పరాజయం చవిచూసింది. ప్రస్తుతం 139వ ర్యాంకులో ఉన్న 24 ఏళ్ల కలినీనా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బరిలో దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. రొలాండ్‌ గారోస్‌లో గత 14 పర్యాయాల్లో కెర్బర్‌ ఎనిమిది సార్లు తొలి రౌండ్లోనే ఓడిపోవడం గమనార్హం.

ఒసాకాకు జరిమానా

తొలి రౌండ్‌లో విజయానంతరం మీడియా సమావేశానికి హాజరు కాకపోవడం వల్ల ఒసాకాకు(Osaka) రిఫరీ జరిమానా విధించాడు. ఆమెకు దాదాపు రూ.11 లక్షల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్యతో పాటు మరో మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నిర్వాహకులు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఆమె ఇలాగే మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటే తనపై కఠినమైన జరిమానాలు విధించడం సహా చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని ఆ ప్రకటనలో తెలిపారు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడనని ఒసాకా చెప్పారు. అయితే మ్యాచ్‌ సందర్భంగా కోర్టులో మాత్రం వ్యాఖ్యాతతో సంభాషించింది.

osaka
ఒసాకా

ఇదీ చూడండి ఆసియా ఛాంపియన్​షిప్​లో​ మేరీకోమ్​కు రజతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.