ఈ నెల చివరి వారంలో ప్రారంభం కావాల్సిన ఫ్రెంచ్ ఓపెన్.. ప్రాణాంతక కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రీఫండ్ ఇవ్వాలని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్‌టీఎఫ్) నిర్వహకులు నిర్ణయించారు.
షెడ్యూల్ ప్రకారం మే 24 నుంచి జూన్ 7 వరకు టోర్నీ జరగాల్సి ఉంది. దీనిని ఇప్పుడు సెప్టెంబర్‌కు 27 నుంచి అక్టోబరు 11 జరపాలని భావిస్తున్నారు. అయితే వైరస్ తీవ్రత రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అప్పుడూ జరుగుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.
ఇదీ చూడండి : వారి కోసం మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగ్గజాలు