ETV Bharat / sports

మట్టికోట రాజెవరో.. నేటి నుంచే ఫ్రెంచ్ ఓపెన్ - జకోవిచ్ తాజా వార్తలు

ఫ్రెంచ్​ ఓపెన్​ కోసం అంతా సిద్ధమైంది. నేటి నుంచే ఈ ఏడాది చివరి గ్రాండ్ స్లామ్​ జరగబోతుంది. మట్టికోట రాజుగా ఉన్న నాదల్​ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటాలని భావిస్తున్నాడు. ప్రపంచ నెంబర్​వన్​ జకోవిచ్​ కూడా ఈసారి ట్రోఫీపై కన్నేశాడు.

French open from Today all Eyes on Nadal
నేటి నుంచే ఫ్రెంచ్ ఓపెన్
author img

By

Published : Sep 27, 2020, 9:29 AM IST

కరోనా కాలంలో ఈ ఏడాది చివరి టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఆదివారమే తెరలేవనుంది. ఎప్పటిలాగే రఫెల్‌ నాదల్‌ ఈ టోర్నీలో ఫేవరేట్‌. ఫెదరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను సమం చేయాలనే పట్టుదలతో నాదల్‌ (19) ఉండగా.. రఫెల్‌ను ఓడించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలవాలన్న లక్ష్యంతో ఉన్నాడు ప్రపంచ నంబర్ వన్ జకోవిచ్‌. మహిళల విభాగంలో మార్గరెట్‌ కోర్ట్‌ (24) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను రికార్డును సమం చేసేందుకు మరో ప్రయత్నం చేయనుంది అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌. ఎవరి కల నెరవేరుతుందో చూడాలి.

French open from Today all Eyes on Nadal
ఫ్రెంచ్ ఓపెన్

ఫ్రెంచ్‌ ఓపెన్‌.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే ఆటగాడు నాదల్‌ (స్పెయిన్‌) అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకూ మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 12 సార్లు అతను ఈ ఎర్రమట్టి కోర్టుపై జెండా ఎగరవేశాడు. 2005 నుంచి ఈ టోర్నీలో పోటీపడుతోన్న అతను ఇప్పటివరకూ 93 మ్యాచ్‌ల్లో గెలిచి.. కేవలం రెండింట్లో మాత్రమే ఓడాడు. ఈ సారి కూడా ట్రోఫీ అందుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాడు. ఏడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న అతను ఈ టోర్నీ కోసం సన్నద్ధమవడానికే యుఎస్‌ ఓపెన్‌కూ దూరమయ్యాడు. ఈ టైటిల్‌ గెలిస్తే అతడు ఫెదరర్‌ ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేస్తాడు.

నాదల్

అయితే పురుషుల సింగిల్స్‌లో నాదల్​కు కాస్త కఠినమైన డ్రా పడింది. ఈ టోర్నీకి సన్నాహకంగా జరిగిన ఇటాలియన్‌ ఓపెన్‌లో అతను క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. అయినప్పటికీ ఈ ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆటగాడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటే మాత్రం ఎప్పటిలాగే చెలరేగిపోతాడనే అంచనాలతో కోర్టులో అడుగుపెడుతున్నాడు. అతనికి నంబర్‌వన్‌ ఆటగాడు జకోవిచ్‌, యూఎస్‌ ఓపెన్‌ విజేత థీమ్‌ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే వీలుంది. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగి అనుకోకుండా లైన్‌ అంపైర్‌ను గాయపర్చడం వల్ల యూఎస్‌ ఓపెన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న జకోవిచ్‌.. ఇటాలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి ఫామ్‌ చాటుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతను గెలిస్తే నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు.

గతేడాది రన్నరప్‌, యూఎస్‌ ఓపెన్‌ విజేత థీమ్‌ ఈ సారి ట్రోఫీ సొంతం చేసుకోవాలనే ధ్యేయంతో ఉన్నాడు. ముర్రే, వావ్రింకా, జ్వెరెవ్‌, మెద్వెదెవ్‌, సిట్సిపాస్‌ లాంటి ఆటగాళ్లు కూడా టైటిల్‌ వేటలో ఉన్నారు. ఫెదరర్‌ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు.

సెరెనా ఈ సారైనా

మార్గరెట్‌ కోర్ట్‌ 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును అందుకోవాలనే ధ్యేయంతో ఉన్న మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనైనా విజయతీరాలకు చేరుతుందో చూడాలి. మరోవైపు టాస్‌సీడ్‌ సిమోనా హలెప్‌ టైటిల్‌ కోసం గట్టిగా పోరాడనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆష్లే బార్టీ, యూఎస్‌ ఓపెన్‌ విజేత ఒసాక బరిలో లేకపోవడం వల్ల టైటిల్‌ నెగ్గేందుకు హలెప్‌కు మంచి అవకాశాలే ఉన్నాయి. వరుసగా 14 మ్యాచ్‌ల్లో గెలవడం సహా.. ప్రేగ్‌, రోమ్‌లో ఎర్రమట్టి కోర్టులపై జరిగిన టోర్నీల్లో గెలిచిన ఆమె మంచి జోరుమీదుంది. అయితే అజరెంకా, ముగురుజ, ప్లిస్కోవా, స్వితోలినా లాంటి క్రీడాకారిణుల నుంచి తనకు పోటీ ఎదురయ్యే వీలుంది.

వాతావరణ పరిస్థితులు కూడా ప్లేయర్లకు సవాలు విసరనున్నాయి. సాధారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రతి ఏడాది మేలో ఆరంభమవుతుంది. అప్పుడు వేసవి కాలం ఉంటుంది. కానీ ఈ సారి వైరస్‌ కారణంగా వాయిదా పడి ఇప్పుడు మొదలవుతుంది. ప్రస్తుతం అక్కడ వర్షాలతో వాతావరణం చల్లగా మారిపోయింది. మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి ఆరంభమవుతాయి.

తప్పుడు ఫలితంతో

కరోనా నిర్ధరణ పరీక్ష ఫలితం పాజిటివ్‌ అని తప్పుగా తేలడం వల్ల మాజీ టాప్‌-10 ఆటగాడు ఫెర్నాండో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. "ఫ్రెంచ్‌ ఓపెన్‌ కోసం పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్వాహకులను అడిగా. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. టోర్నీ నుంచి తప్పించారు. నేను సొంతంగా పరీక్ష చేపించుకోగా మళ్లీ నెగెటివ్‌ వచ్చింది. టోర్నీకి దూరమవడం నిరాశతో పాటు చిరాకును కలిగిస్తోంది"’ అని ఫెర్నాండో చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.