ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా బర్బోరా క్రేజికోవా నిలిచింది. తద్వారా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుందీ చెక్ రిపబ్లిక్ ప్లేయర్.
ఫైనల్లో అనస్తాసియా పవ్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో గెలుపొందింది క్రేజికోవా. 52 గ్రాండ్ స్లామ్‌లు ఆడిన అనుభవం ముందు 5 గ్రాండ్ స్లామ్‌లు కూడా ఆడని యువ టెన్నిస్ క్రీడాకారిణే విజేతగా నిలబడింది.
ఫ్రెంచ్ ఓపెన్ గెలుపొందిన రెండో చెక్ రిపబ్లిక్ దేశస్థురాలు క్రేజికోవా. 1981లో హన మండ్లీకోవా ఈ ఘనత అందుకుంది.
ఇదీ చదవండి: French Open: 'నాదల్కు ఓటమా? జోక్‌లా ఉంది!'