ETV Bharat / sports

French Open: ఓటమితో స్వితోలినా ఇంటిముఖం - ఫ్రెంచ్ ఓపెన్ 2021

ఫ్రెంచ్​ ఓపెన్​లో ఉక్రెయిన్​ టెన్నిస్ ప్లేయర్​ స్వితోలినా ఓటమి పాలైంది. మహిళల మూడో రౌండ్లో చెక్​ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రెజికోవాతో జరిగిన మ్యాచ్​లో 3-6,2-6 తేడాతో పరాజయం పొందింది. పురుషుల సింగిల్స్​లో స్పెయిన్ స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్ ముందడుగు వేశాడు. మూడో రౌండ్లో బ్రిటన్​ ఆటగాడు కామోరున్ నోరిపై విజయం సాధించాడు.

elina sviotlina, french open
స్వితోలినా, ఉక్రెయిన్ టెన్నిస్ ప్లేయర్
author img

By

Published : Jun 6, 2021, 6:55 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఉక్రెయిన్‌ స్టార్‌, అయిదో సీడ్‌ స్వితోలినా కథ ముగిసింది. ఆమె ప్రిక్వార్టర్స్‌ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో స్వితోలినా 3-6, 2-6తో అన్‌సీడెడ్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయింది. ఈ పోరులో ఆరంభం నుంచి క్రెజికోవా దూకుడు ముందు స్వితోలినా నిలువలేకపోయింది. ఒత్తిడికి గురై బంతిని కోర్టుకు దూరంగా కొట్టడమే కాకుండా పాటు డబుల్‌ఫాల్ట్స్‌ చేసింది. మరోవైపు స్వేచ్ఛగా ఆడిన క్రెజికోవా.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి సునాయాస విజయాన్ని అందుకుంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరింది. ఈ ఎనిమిదో సీడ్‌ 7-5 (7/4), 6-0తో కొంటావిట్‌ (ఇస్తోనియా)ను ఓడించింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న స్వైటెక్‌ రెండో సెట్లో విజృంభించి ఆడింది. కొంటావిట్‌కు ఒక్క గేమ్‌ ఇవ్వకుండా సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అమెరికా అమ్మాయిలు సోఫియా కెనిన్‌, స్లోన్‌ స్టీఫెన్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. నాలుగోసీడ్‌ కెనిన్‌ 4-6, 6-1, 6-4తో జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలవగా, స్టీఫెన్స్‌ 6-3, 7-5తో ముచోవా (రష్యా)ను ఓడించింది. కొస్తుక్‌ (ఉక్రెయిన్‌), జబెర్‌ (ట్యూనీసియా) కూడా మూడో రౌండ్‌ అధిగమించారు. కొస్తుక్‌ 6-1, 6-2తో గ్రెచెవా (రష్యా)పై, జబెర్‌ 3-6, 6-0, 6-1తో లినెటె (పోలెండ్‌)పై విజయం సాధించారు.

నాదల్‌ మరో అడుగు:

పద్నాలుగో ఫ్రెంచ్‌ టైటిల్‌పై గురిపెట్టిన స్పెయిన్‌ వీరుడు రఫెల్‌ నాదల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఈ మూడో సీడ్‌ 6-3, 6-3, 6-3తో కామెరూన్‌ నోరి (బ్రిటన్‌)ను ఓడించాడు. ఈ పోరులో ఆరంభం నుంచి నాదల్‌దే జోరు. కానీ రెండో సెట్లో అతడికి నోరి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో ఈ బ్రిటన్‌ కుర్రాడు 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ వరుసగా అయిదు గేమ్‌లు సాధించిన రఫా.. 6-3తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ క్రమంలో నాలుగుసార్లు నోరి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. అదే జోరును మూడో సెట్లోనూ ప్రదర్శించిన నాదల్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఓ మెరుపు ఫోర్‌ హ్యాండ్‌ విన్నర్‌తో అతడీ సెట్‌ను గెలుచుకున్నాడు. రొలాండ్‌ గారోస్‌లో నాదల్‌కు ఇది 103వ విజయం. ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అత్యధిక విజయాల ఘనత అతడిదే. ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌ చేరడం రఫాకు ఇది 16వ సారి. మొత్తం మీద గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఈ దశకు చేరడం అతడికిది 50వ సారి.

ఇదీ చదవండి: కేంద్రమంత్రికి సానియా మీర్జా కృతజ్ఞతలు

జకో పన్నెండోసారి:

టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మూడో రౌండ్లో ఈ ప్రపంచ నంబర్‌వన్‌ 6-1, 6-4, 6-2తో రికార్డాస్‌ బెర్కిన్స్‌ (లిథుయేనియా)పై పెద్దగా కష్టపడకుండా నెగ్గాడు. రొలాండ్‌ గారోస్‌లో ప్రిక్వార్టర్స్‌ దశకు చేరడం నొవాక్‌కు ఇది వరుసగా 12వ సారి కావడం విశేషం. పదోసీడ్‌ ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా), సినర్‌ (ఇటలీ), స్ట్రాఫ్‌ (జర్మనీ), లోరెంజో ముసెటి (ఇటలీ) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు. ష్వార్జ్‌మాన్‌ 6-4, 6-2, 6-1తో కోల్‌స్క్రీబర్‌ (జర్మనీ)పై నెగ్గగా.. స్ట్రాఫ్‌ 6-4, 7-6 (7/3), 6-2తో స్పెయిన్‌ యువ కెరటం అల్‌క్రాజ్‌ పోరాటానికి తెరదించాడు. హోరాహోరీగా సాగిన మరో పోరులో ముసెటి 3-6, 6-4, 6-3, 3-6, 6-3తో తన దేశానికే చెందిన మార్కోను ఓడించగా.. సినర్‌ 6-1, 7-5, 6-3తో యెమెర్‌ (స్వీడన్‌)పై గెలిచాడు. సిట్సిపాస్‌ (గ్రీస్‌) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరాడు.

సిజికోవా విడుదల:

గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందన్న అనుమానంతో అరెస్టు చేసిన రష్యా క్రీడాకారిణి యానా సిజికోవాను పోలీసులు విడుదల చేశారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రాథమికంగా విచారించిన తర్వాత వదిలేశారు. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ సిజికోవా పరువు నష్టం దావా వేయబోతున్నట్లు సమాచారం. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెప్టెంబర్‌ 30న జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో బ్రింగిల్‌ (అమెరికా)తో కలిసి ఆడిన సిజికోవా... ఆండ్రియా మిటూ-వమారియా (రొమేనియా)తో పోరులో రెండో సెట్లో కీలక సమయంలో ఉద్దేశపూర్వకంగా డబుల్‌ ఫాల్ట్‌ చేసిందనేది పోలీసుల ఆరోపణ.

ఇదీ చదవండి: French Open: ఒసాకా వైదొలగడానికి కారణమిదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.