ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: సంచలనాల మోత​.. అన్​సీడెడ్​ ప్లేయర్స్ జోరు - nadal news updates

ఫ్రెంచ్‌ ఓపెన్‌ దద్దరిల్లింది. సంచలనాలతో హోరెత్తింది. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌, అయిదో సీడ్‌ బెర్టెన్స్‌, పదకొండో సీడ్‌ ముగురుజ ప్రి క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు. అనామక క్రీడాకారులు స్వైటక్‌ (పోలెండ్‌), ట్రెవిసాన్‌ (ఇటలీ), కొలిన్స్‌ (అమెరికా) వీరికి షాకివ్వడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో అయిదో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను కూడా అన్‌సీడెడ్‌ క్రీడాకారుడైన సిన్నర్‌ ఓడించి సంచలనం సృష్టించాడు. మరోవైపు హాట్‌ ఫేవరెట్‌ రఫెల్‌ నాదల్‌ 13వ ఫ్రెంచ్‌ టైటిల్‌ దిశగా మరో అడుగు వేశాడు. అతను అలవోకగా క్వార్టర్‌ఫైనల్‌ చేరాడు.

French Open:
ఫ్రెంచ్​ ఓపెన్
author img

By

Published : Oct 5, 2020, 6:23 AM IST

పోలెండ్‌ టీనేజ్‌ టెన్నిస్‌ తార స్వియాటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనం సృష్టించింది. దూకుడైన ఆటతో టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)ను ఇంటిముఖం పట్టించింది. ఆదివారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అన్‌ సీడెడ్‌ స్వైటక్‌ 6-1, 6-2తో హలెప్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కేవలం 45 నిమిషాల్లోనే ముగిసిన ఈ సమరంలో బేస్‌లైన్‌ ఆటతో, నెట్‌ ప్లేతో అదరగొట్టిన 19 ఏళ్ల స్వైటక్‌.. తొలి సెట్​లో రెండుసార్లు హలెప్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 26 నిమిషాల్లోనే సెట్‌ సొంతం చేసుకుంది.

రెండో సెట్​లో తొలి గేమ్‌లోనే సర్వీస్‌ కోల్పోయిన హలెప్‌.. ఇక పుంజుకోలేకపోయింది. అయిదో గేమ్‌లో సిమోనా సర్వీస్‌ను మరోసారి బ్రేక్‌ చేసిన స్వైటక్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. గతేడాది రొలాండ్‌ గారోస్‌లో హలెప్‌.. స్వైటక్‌పైనే గెలిచి క్వార్టర్‌ చేరడం విశేషం. ప్రపంచ 54వ ర్యాంకర్‌ స్వైటక్‌కు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

French Open:
హలెప్‌

మరోవైపు అయిదోసీడ్‌ కికి బెర్టెన్స్‌ 4-6, 4-6తో మార్టినా ట్రెవిసాన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో నాలుగుసార్లు సర్వీస్‌ కోల్పోవడమే కాకుండా రెండు డబుల్‌ఫాల్ట్స్‌ చేసిన బెర్టెన్స్‌ ఓటమి కొనితెచ్చుకుంది. ఇంకో మ్యాచ్‌లో ముగురుజ (స్పెయిన్‌) 5-7, 6-2, 4-6తో డానియల్‌ కొలిన్స్‌ (అమెరికా) చేతిలో ఓడగా.. మూడోసీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), పొడొరోస్కా (అర్జెంటీనా) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. స్వితోలినా 6-1, 6-3తో గార్సియా (ఫ్రాన్స్‌)పై, పొడొరోస్కా 2-6, 6-2, 6-3తో క్రెజ్‌సికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించారు.

French Open:
రఫెల్​ నాదల్​

రఫెల్​ దూకుడు:

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ దూసుకెళ్తున్నాడు. అతను పెద్దగా కష్టపడకుండానే క్వార్టర్‌ఫైనల్‌ చేరాడు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌ 6-1, 6-1, 6-2తో అమెరికా కుర్రాడు సెబాస్టియన్‌ కొర్డాను చిత్తు చేశాడు. ఈ పోరులో నాదల్‌ దూకుడు ముందు కొర్డా నిలువలేకపోయాడు. తన శైలి బేస్‌లైన్‌ ఆట బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడిన రఫా.. ఎనిమిదిసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో క్వార్టర్స్‌ చేరడం రఫాకు ఇది 14వసారి.

మరోవైపు జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌కు షాక్‌ తగిలింది. ఇటలీ క్వాలిఫయర్‌ జెనిక్‌ సిన్నర్‌ 6-3, 6-3, 4-6, 6-3తో జ్వెరెవ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల సిన్నర్‌.. 3 ఏస్‌లతో పాటు 39 విన్నర్లు కొట్టాడు. డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), స్క్వాట్జ్‌మెన్‌ (అర్జెంటీనా) క్వార్టర్స్‌ చేరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.