దిగ్గజ టెన్నిస్ ఆటగాడు, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్.. ఈ ఏడాది మొత్తానికి టెన్నిస్‌కు దూరం కానున్నట్లు తెలిపాడు. 2021లో ప్రారంభంలో మైదానంలోకి దిగుతానని చెప్పాడు. కుడి మోకాలికి ఇటీవల శస్త్రచికిత్స జరగడం వల్లే, విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
- — Roger Federer (@rogerfederer) June 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Roger Federer (@rogerfederer) June 10, 2020
">— Roger Federer (@rogerfederer) June 10, 2020
20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత ఫెదరర్‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో కుడి మోకాలికి శస్తచికిత్స జరిగింది. తొలుత నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు ఫెదరర్. కానీ ప్రాణాంతక కరోనాతో టోర్నీలు జరిగేది అనుమానంగా మారిన నేపథ్యంలో ఆటకు ఈ ఏడాది చివరకు దూరంగా ఉండనున్నాడు.
ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వింబుల్డన్ టోర్నీ రద్దయింది. ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబరుకు వాయిదా పడగా, యూఎస్ ఓపెన్ నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది.
ఇది చూడండి : మాజీ రంజీ క్రికెటర్ హత్య.. కుమారుడు అరెస్టు