ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన నొవాక్ జకోవిచ్.. టైటిల్‌ను ఎక్కువ సార్లు గెలవడంపై ఫన్నీగా స్పందించాడు. 'ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది' అని చమత్కరించాడు.
ఈ టెన్నిస్ కోర్టులో మెద్వెదెవ్ కఠిన ప్రత్యర్థి. నువ్వు తప్పకుండా ఏదో ఒక రోజు గ్రాండ్‌స్లామ్ సాధిస్తావు. కానీ దానికి మరికొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ కోర్టు అంటే ఎంతో ఇష్టం. రోడ్ లావెర్ అరెనా ప్రాంతమన్నా ఎంతో ఇష్టం. ప్రతి ఏడాదికి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ప్రేమ పెరుగుతోంది. ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతూ ఉంటుంది. థాంక్యూ సో మచ్.
-నొవాక్ జకోవిచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత.
కరోనా మార్గదర్శకాల నడుమ టోర్నీని విజయవంతంగా జరిపిన నిర్వాహకులకు జకోవిచ్ ధన్యవాదాలు తెలిపాడు.
ఇదీ చదవండి: 'పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్‌కు అవకాశాలు కష్టమే'