ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్.. దుబాయి ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరాడు. నేడు జరగనున్న తుది పోరులో గ్రీస్ ప్లేయర్ స్టెఫానోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ సెంట్రల్ కోర్టు వేదికగా జరగనుంది.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన మోన్ఫిల్స్తో ఉత్కంఠ పోరు ఎదుర్కొన్నాడు జకో. అయితే కీలక సమయంలో 3 మ్యాచ్ పాయింట్లు కాచుకొని మ్యాచ్ నెగ్గాడు. ఇప్పటివరకు ఏటీపీ 500 ఈవెంట్లలో 46 సార్లు సెమీస్ చేరిన జకో.. 40 సార్లు విజేతగా నిలవడం విశేషం.