ETV Bharat / sports

Wimbledon: క్రొయేషియా జోడీకే వింబుల్డన్​ డబుల్స్​ ట్రోఫీ - నికోలా మెక్టిక్​-మేట్ పావిక్

వింబుల్డన్(Wimbledon) పురుషుల డబుల్స్​ టైటిల్​ను క్రొయేషియా జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్లో నికోలా మెక్టిక్​-మేట్ పావిక్ జోడీ.. మార్సెల్​ గ్రానోల్లర్స్​(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) ద్వయంపై గెలుపొందింది.​

Croatian duo Mektic, Pavic
నికోలా మెక్టిక్​-మేట్ పావిక్
author img

By

Published : Jul 11, 2021, 11:09 AM IST

వింబుల్డన్(Wimbledon)​ పురుషుల డబుల్స్​ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్​, మేట్​ పావిక్​ కైవసం చేసుకున్నారు. ఫైనల్లో మార్సెల్​ గ్రానోల్లర్స్​(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై 6-4, 7-6 (5), 2-6, 7-5తో విజయం సాధించింది.

వింబుల్డన్​ టైటిల్​ గెలిచిన మొదటి క్రొయేషియా డబుల్స్​ జోడీగా ఈ ద్వయం రికార్డు సృష్టించింది. 20 ఏళ్ల క్రితం అదే దేశానికి చెందిన గోరాన్​ ఇవానిసెవిక్​ పురుషుల సింగిల్స్​ గెలుపొందాడు. మెక్టిక్​-పావిక్​ జంటకు ఈ సీజన్​లో ఎనిమిదో టైటిల్​ ఇది.

2018 ఆస్ట్రేలియా ఓపెన్​తో పాటు యూఎస్​ ఓపెన్​ను పావిక్​ వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందాడు. మెక్టిక్​కు మాత్రం ఇదే తొలి గ్రాండ్​స్లామ్​. టోక్యో ఒలింపిక్స్​లోనూ వీరిద్దరూ జంటగా బరిలోకి దిగనున్నారు. ​

ఇదీ చదవండి: Wimbledon: 20 కోసం జకో.. తొలి గ్రాండ్​స్లామ్​​ దిశగా బెరిటిని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.