ETV Bharat / sports

ఒలింపిక్స్​కు మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్​ దూరం - బియాంకా ఆండ్రెస్క్యూ

టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకొంటున్నట్లు మరో టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి ప్రకటించింది. కెనడాకు చెందిన బియాంకా ఆండ్రెస్కు కొవిడ్​ మహమ్మారి కారణంగా విశ్వక్రీడల నుంచి వైదొలిగింది.

Bianca Andreescu, Canada tennis player
బియాంకా ఆండ్రెస్క్యూ, కెనడా టెన్నిస్ ప్లేయర్
author img

By

Published : Jul 13, 2021, 12:52 PM IST

టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకొంటున్న టెన్నిస్ ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కెనడా స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ బియాంకా ఆండ్రెస్కు విశ్వక్రీడల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. కొవిడ్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2024 పారిస్​ ఒలింపిక్స్​లో తప్పనిసరిగా పాల్గొంటానని ప్రమాణం చేసిందీ ఐదో సీడ్​ ప్లేయర్.

"ఒలింపిక్స్​ నుంచి తప్పుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నా. నా చిన్నతనం నుంచి ఒలింపిక్స్​లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాను. కానీ, ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ విశ్వక్రీడల నుంచి తప్పుకోక తప్పట్లేదు. ఇది నన్ను బాధించినా.. ప్రస్తుత సమయానికి తగిన నిర్ణయమిది. పారిస్ వేదికగా 2024లో జరిగే ఒలింపిక్స్​లో తప్పనిసరిగా పాల్గొంటా."

-బియాంకా, టెన్నిస్ ప్లేయర్.

స్టార్ టెన్నిస్​ ఆటగాడు రఫెల్​ నాదల్, అమెరికా ప్లేయర్​ సెరెనా విలియమ్స్​, సిమోనా హలెప్, డొమినిక్ థీమ్.. ఇప్పటికే ఒలింపిక్స్​ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. టోక్యో వేదికగా ఈ విశ్వ క్రీడలు జులై 23న ప్రారంభమై.. ఆగస్టు 8న ముగియనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.