వింబుల్డన్‌లో(Wimbledon) భారత ద్వయం రోహన్ బోపన్న-సానియా మీర్జా(Sania mirza) జోడీ.. మన దేశానికే చెందిన రామ్‌కుమార్ రామ్‌నాథన్- అంకితా రైనాపై(Ankitha Raina) 6-2, 7-6(5) తేడాతో గెలిచింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో తొలిరౌండ్లో ఈ ఫలితం ఎదురైంది. గ్రాండ్‌స్లామ్‌లో(Grandslam) చరిత్రలోనే మన దేశానికి చెందిన ప్లేయర్లు తలపడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మరోవైపు సింగిల్స్ విభాగంలో పోటీపడనున్న రామ్‌కుమార్.. 21 ప్రయత్నాల తర్వాత వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
మహిళల డబుల్స్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసిన సానియా మీర్జా.. గురువారం జరిగిన రెండో రౌండ్లో అంకితా రైనా-లారెన్ డేవిస్‌పై వరుస సెట్లలో విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిన బోపన్న-దివిజ్ శరణ్ జోడీ.. వింబుల్డన్ నుంచి ఇప్పటికే నిష్క్రమించారు.
ఇవీ చదవండి: