డబ్ల్యూటీఏ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బార్టీ 8,717 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రొమేనియాకు చెందిన సిమోనా హలెప్ 6,076 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పురుషుల విభాగంలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌కు ఈ ఏడాది బాగా కలిసివస్తోంది. ఆస్ట్రేలియా ఓపెన్, దుబాయ్ ఛాంపియన్‌షిప్‌లలో మంచి విజయాలు సాధించిన జకో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలుపుకోగలిగాడు. .
స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్ టాప్ 10 ఆటగాళ్లలో చోటు దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో ఉన్న ఈమె ఎనిమిదో స్థానానికి చేరుకుంది. రష్యన్ స్వెత్లానా కుజ్నెత్సోవా 32, బ్రిటన్ హీథర్ వాట్సన్ 49వ స్థానాల్లో నిలిచారు.
ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం మోకాలి గాయంతో ఆటకు దూరమైన థీమ్ జూన్‌లో మళ్లీ బరిలో దిగనున్నాడు. దుబాయ్ టైటిల్‌ను గెలుచుకున్న జకోవిచ్ 10,220 పాయింట్లతో అగ్రస్థానంలో, నాదల్ 9,850 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచారు.
-
Too good tonight, my friend. Always a pleasure 💫 @Petra_Kvitova pic.twitter.com/LZYb9t5Jg2
— Ash Barty (@ashbarty) February 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Too good tonight, my friend. Always a pleasure 💫 @Petra_Kvitova pic.twitter.com/LZYb9t5Jg2
— Ash Barty (@ashbarty) February 28, 2020Too good tonight, my friend. Always a pleasure 💫 @Petra_Kvitova pic.twitter.com/LZYb9t5Jg2
— Ash Barty (@ashbarty) February 28, 2020
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్ సెమీస్ ముంగిట ఆసీస్‌కు షాక్