ETV Bharat / sports

'కలలు కనే తల్లులకు మేమిద్దరం స్ఫూర్తి' - యూఎస్​ ఓపెన్​

సెరెనా విలియమ్స్, తన లాంటి తల్లుల ప్రోత్సాహం ఎంతో మంది మహిళలకు ప్రేరణగా నిలుస్తుందని టెన్నిస్​ ప్లేయర్​ అజరెంకా తెలిపింది. యూఎస్​ ఓపెన్​ సెమీ ఫైనల్​లో విలియమ్స్​ను ఓడించి ఫైనల్​కు చేరుకుంది అజరెంకా.

Azarenka
అజరెంకా
author img

By

Published : Sep 11, 2020, 4:38 PM IST

ప్రముఖ టెన్నిస్​​ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా మాతృమూర్తులను ఉద్దేశించి కీలక సందేశాన్నిచ్చింది. సెరెనా విలియన్స్​, తన లాంటి తల్లుల ప్రదర్శన.. ఎంతో మంది మహిళలకు తమ కలలను నెరవేర్చుకోవడానికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పింది.

యూఎస్​ ఓపెన్​లో అజరెంకా 1-6, 6-3, 6-3తో విలియన్స్​ను ఓడించి ఫైనల్​కు చేరుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో సెమీఫైనల్​కు చేరుకున్న తొలి మాతృమూర్తులుగా వీరిద్దరు నిలిచారు.

ఈ సందర్భంగా అజరెంకా మాట్లాడుతూ.. ఓ తల్లిగా తనకు చాలా బాధ్యతలున్నాయని అయితే, టెన్నిస్​ కోర్టులోకి అడుగుపెడితే.. ఫైటర్​లా మారిపోతానని పేర్కొంది. తల్లిగా ఉండటం ఎంతో కష్టమైనప్పటికీ అన్నింటినీ సమతుల్యం చేసుకోగలిగితే ఏదైనా సాధించొచ్చని తెలిపింది.

శనివారం జరిగే ఫైనల్​లో అజరెంకా 2018 యూఎస్​ ఓపెన్​ ఛాంపియన్​ నవోమి ఒసాకాతో తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.