Australian open 2021: డబ్ల్యూటీఏ 500 అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సానియా-నడియా కిచెనోక్ (ఉక్రెయిన్) 6-0, 1-6, 10-5తో షెల్బీ రోజర్స్ (అమెరికా)- హెథర్ వాట్సన్ (బ్రిటన్)పై పోరాడి గెలిచారు.
పోరాడి గెలిచి..
ఈ మ్యాచ్ ఆరంభంలో సానియా జంటదే జోరు..! తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా సెట్ సొంతం చేసుకున్న భారత్-ఉక్రెయిన్ జంటకు రెండో సెట్లో షెల్బీ ద్వయం పంచ్ ఇచ్చింది. సానియా-నడియాలకు ఒకే ఒక్క గేమ్ వదులుకున్న షెల్బీ-హెథర్ 6-1తో సులభంగా సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచారు. ఫలితాన్ని నిర్ణయించే మూడో సెట్లో షెల్బీ జంట నుంచి పోటీ ఎదురైనా కీలక సమయంలో వరుస పాయింట్లు సాధించిన సానియా జోడీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్లో స్థానం కోసం బార్టీ-స్టార్మ్ సాండర్స్ (ఆస్ట్రేలియా)తో సానియా ద్వయం తలపడనుంది. జనవరి 17న ఆరంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అడిలైడ్ టోర్నీని సన్నాహకంగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: Australian open 2021: సానియా, బోపన్న జోడీలు ముందంజ