ETV Bharat / sports

Australia Open Djokovic: జకోవిచ్​కు ఘోర అవమానం - ఆస్ట్రేలియా ఓపెన్​ 2022 జకోవిచ్​

Australia Open Djokovic 2022: సెర్బియా​ టెన్నిస్‌ స్టార్​ నొవాక్‌ జకోవిచ్‌కు ఘోర అవమానం జరిగింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అతడి వీసాను రద్దు చేశారు. కరోనా వ్యాక్సిన్​కు​ సంబంధించిన తగిన వివరాలను జకోవిచ్​ సమర్పించకపోవడమే కారణమని ఆస్ట్రేలియా బోర్డర్​ ఫోర్స్​ అధికారులు వెల్లడించారు.

Australia Open Djokovic 2022:
జకోవిచ్​ ఆస్ట్రేలియా ఓపెన్​ 2022
author img

By

Published : Jan 6, 2022, 8:19 AM IST

Australia Open Djokovic 2022: టెన్నిస్‌ దిగ్గజ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్‌కు ఘోర అవమానం జరిగింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అతడి వీసా రద్దు చేశారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు ఈ సెర్బీయా ఆటగాడు మెల్‌బోర్న్‌కు చేరుకున్నాడు. అయితే, కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన తగిన ఆధారాలు సమర్పించని కారణంగా జకోవిచ్‌ను నిలిపిపేసినట్లు ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. వీసా రద్దుతో జకోవిచ్‌ 8 గంటల పాటు మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలోనే ఉండిపోయాడు.

ఈ విషయంపై సెర్బియా ప్రెసిడెంట్‌ అలెక్సాండర్‌ వ్యూకిక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడితో ఇలాగేనా వ్యవహరించేది అని మండిపడ్డారు. మరోవైపు తాను జకోవిచ్‌తో మాట్లాడానని, దేశం మొత్తం అతడికి అండగా ఉందని చెప్పానన్నారు. ఇక ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ సైతం స్పందించారు. తమ దేశ సరిహద్దుల్లోకి ఎవరు వచ్చినా కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే అన్నారు. ఏ వ్యక్తికికైనా ఒకే విధమైన నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉన్న జకోవిచ్‌ ఇప్పటికే 9 సార్లు 'ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌' టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.

ఇదీ చూడండి: Novak Djokovic: అలా చేయకపోతే జకోవిచ్‌ ఇంటికే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.