ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆండీ ముర్రే... త్వరలో జరిగే వాషింగ్టన్ ఓపెన్‌లో సోదరుడు జెమీ ముర్రేతో కలిసి డబుల్స్ ఆడనున్నాడు. వీరిద్దరూ ఇంతకుముందే 2015 డేవిస్ కప్‌లో విజేతలుగా నిలిచారు.
ఆండీ ముర్రేకు ఈ ఏడాది జనవరిలో నడుము భాగంలో శస్త్రచికిత్స జరిగింది. జూన్‌లో కోర్టులోకి అడుగుపెట్టాడు. ఆ వెంటనే ఫెలిసియానో లోపెజ్‌తో కలిసి క్వీన్స్ డబుల్స్ టైటిల్ గెల్చుకున్నాడు.
32 ఏళ్ల ఆండీ ముర్రే.. సింగిల్స్ విభాగంలో మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచాడు. కానీ ఇటీవల జరిగిన టోర్నీల్లో అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.
సోదరునితో కలిసి డబుల్స్ ఆడటంపై స్పందించాడు ఆండీ సోదరుడు జెమీ.
"డబుల్స్ ఈవెంట్‌పై పూర్తి దృష్టి సారించాం. ఆండీ పునరాగమనంతో ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు." -జెమీ ముర్రే, ఆండీ సోదరుడు
వాషింగ్టన్ ఓపెన్.. జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకు జరగనుంది.
ఇది సంగతి: జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సింధు