టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో(WI vs BAN T20).. విండీస్ జట్టు ఆరంభంలో తడబడినా ఆఖర్లో రాణించింది. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కష్టాల్లో పడింది. అయితే, అరంగేట్ర ఆటగాడు రోస్టన్ ఛేజ్ (39), ఆఖర్లో వచ్చిన నికోలస్ పూరన్ (40) ధాటిగా ఆడారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ జట్టు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4) ఘోరంగా విఫలమయ్యారు. మూడో ఓవర్లో లూయిస్ క్యాచ్ ఔట్ కాగా.. ఐదో ఓవర్లో గేల్ బౌల్డయ్యాడు. దీంతో పవర్ ప్లే (6 ఓవర్లు) పూర్తయ్యే సరికి వెస్టిండీస్ స్కోరు 29/2గా ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన షిమ్రోన్ హెట్మెయర్ (9) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆండ్రూ రస్సెల్ (0), డ్వేన్ బ్రావో (1) కూడా రాణించలేదు. తర్వాత వచ్చిన రోస్టన్ ఛేజ్, నికోలస్ పూరన్ ధాటిగా ఆడారు. అయితే, వీరిద్దరినీ షొరిఫుల్ ఇస్లామ్ 19వ ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి డ్వేన్ బ్రావో (1) సౌమ్య సర్కార్‌కి చిక్కాడు. తర్వాత జేసన్ హోల్డర్ (15 ) వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది. చివరి బంతికి పొలార్డ్ (14) సిక్స్ బాదాడు. హోల్డర్, పొలార్డ్ నాటౌట్‌గా నిలిచారు.
ఇదీ చదవండి: